ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ తన యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. డేటా ట్రాన్స్‌ఫర్ టూల్ పేరిట ఓ నూతన ఫీచర్ ప్రస్తుతం ఫేస్‌బుక్ యూజర్లకు అందుబాటులో ఉంది. దీని సహాయంతో వారు ఫేస్‌బుక్‌లో ఉన్న తమ ఫొటోలు, వీడియోలను ఇకపై గూగుల్ ఫొటోస్‌లోకి సులభంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. కాగా ఈ ఫీచర్‌ను 2019లోనే ఫేస్‌బుక్ లాంచ్ చేయగా.. అప్పట్లో దీన్ని కేవలం యూకే, యూఎస్ఏ, కెనడా దేశాల్లోని యూజర్లకు మాత్రమే అందించారు. కానీ ఈ టూల్‌ను ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూజర్లు వాడుకోవచ్చని ఫేస్‌బుక్ తెలియజేసింది.
ఫేస్‌బుక్ డేటా ట్రాన్స్‌ఫర్ టూల్‌ను వాడుకోవాలంటే.. యూజర్లు ఇలా చేయాలి.
1. ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అయి అందులో ఉండే సెట్టింగ్స్‌లోని యువర్ ఫేస్‌బుక్ ఇన్ఫర్మేషన్ అనే విభాగంలోకి వెళ్లాలి.
2. అక్కడ ఉండే ట్రాన్స్‌ఫర్ ఎ కాపీ ఆఫ్ యువర్ ఫొటోస్ ఆర్ వీడియోస్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
3. ఫేస్‌బుక్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి.
4. ఎంచుకున్న ఫొటోలు, వీడియోలు ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ అవ్వాలో ఆ డెస్టినేషన్‌ను ఎంచుకోవాలి.
5. కన్‌ఫాం ట్రాన్స్‌ఫర్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి.
అంతే.. ఫేస్‌బుక్‌లో యూజర్లు ఎంచుకున్న డేటా గూగుల్ ఫొటోస్‌లోకి కాపీ అవుతుంది. ఫేస్‌బుక్ తన యూజర్లకు వారి డేటా వాడకంపై మరింత నియంత్రణ ఉండేందుకు గాను ఈ టూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని ప్రస్తుతం ప్రపంచంలో ఏ ఫేస్‌బుక్ యూజర్ అయినా వాడుకోవచ్చు.