ఫ్యాక్ట్ చెక్: మళ్ళీ వెయ్యి రూపాయిల నోట్లను తీసుకు వస్తున్నారా..?

-

ఎక్కడ చూసిన మోసాలు నకిలీ వార్తలే. సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి. అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. అలాంటి తప్పులని అస్సలు చెయ్యద్దు. వీలైనంత వరకు నకిలీ వార్తలకి దూరంగా ఉండడమే మంచిది.

తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది. మరి అది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం. వెయ్యి రూపాయల నోట్ల ని బ్యాన్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే మళ్లీ తిరిగి 2000 రూపాయల నోట్లని జనవరి 1 2023 నుండి తీసుకు వస్తున్నారని ఈ వార్తలో ఉంది. అయితే మరి నిజంగా ప్రభుత్వం వెయ్యి రూపాయల నోట్లను మళ్లీ తీసుకు వస్తున్నారా..?

జనవరి 1, 2023 నుండి 1000 రూపాయల నోట్లని మళ్లీ మనం ఉపయోగించవచ్చా..? అలానే 2000 రూపాయల నోట్లోని బ్యాంకులకు మనం ఇచ్చేయాలా…? ఇది నిజమా కాదా అనేది చూస్తే… ఇది కేవలం ఫేక్ వార్త అని తెలుస్తోంది ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదు ఇలాంటి వార్తలు అనవసరంగా నమ్మి మోసపోకండి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీని మీద స్పందించి ఇది నకిలీ వార్త అని చెప్పేసింది. కనుక అనవసరంగా ఇలాంటి వార్తలని నమ్మి మోసపోవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news