నాపై బీజేపీ కుట్ర చేస్తోంది: రోహిత్ రెడ్డి

-

ఫామ్‌హౌస్‌ కేసులో తనను దోషిగా చూపించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఫిర్యాదుదారునిగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎక్కడా కూడా మనీలాండరింగ్ జరగలేదు. కేవలం నన్ను లొంగదీసుకోడానికి మాత్రమే ఈడీ విచారణ జరుపుతుందన్నారు. బీజేపీ నాయకులూ ఎందుకు విచారణకు రావడం లేదు. కంప్లైంట్ చేసిన నన్ను విచారించారు. కానీ నిందితులకు ఎందుకు ప్రశ్నించలేదని రోహిత్ రెడ్డి ప్రశ్నించారు. ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ రేపు హైకోర్టులో రిట్ దాఖలు చేయబోతున్నా. ఈడీ, సీబీఐ, ఐటీ అనే త్రిశూలాన్ని కేంద్రం వాడుతుంది. కేంద్రం చేతిలో ఉన్న ఈడీ ద్వారా నోటీసులు ఇచ్చి నన్ను విచారించారు.

ED grills Rohit Reddy for six hours, asks him to appear again today

కానీ బీజేపీ నాయకుల బండారం త్వరలోనే బయటపడుతుందన్నారు. కాగా రేపు నందకుమార్ ను ఈడీ ప్రశ్నించనుంది. చంచల్ గూడ జైల్లో ఉన్న నందకుమార్ ను 2 రోజుల పాటు ఈడీ విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. రోహిత్ రెడ్డి సోదరునితో నందకుమార్ వ్యాపారాలకు సంబంధించిన అంశాలపై ఈడీ విచారించనుంది. ఈ క్రమంలో రోహిత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నన్ను ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు. అందుకే నందకుమార్ నుండి ఇష్టమొచ్చిన స్టేట్ మెంట్ తీసుకోనున్నట్టు తెలిపారు. నన్ను అరెస్ట్ చేసిన మీకు లొంగేది లేదు. ఇది రోహిత్ ఒక్కడి సమస్య బీఆర్‌ఎస్‌ సమస్య కాదు యావత్ తెలంగాణ సమస్య. మీరు నన్ను, నా కుటుంబంపై ఎన్ని కుట్రలు చేసినా తగ్గదే లేదని రోహిత్ రెడ్డి తేల్చి చెప్పారు. నన్ను ఇబ్బంది పెట్టడానికి ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో నందకుమార్ ద్వారా నన్ను ఇరికించాలని చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news