తరచు మనకి సోషల్ మీడియాలో ఏదో ఒక నకిలీ వార్త కనబడుతూనే ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ గా మారింది. అయితే ఆ ఫోటోలో ఢిల్లీ చీఫ్ మినిస్టర్ మరియు ఏపీ సుప్రీమో అరవింద్ కేజ్రీవాల్ మాన్ తో కలిసి ఆల్కహాల్ మరియు మాంసాన్ని సేవిస్తున్నట్టు ఉంది. ఆ ఫోటోలో మనం మూడు ప్లేట్లు ఆహారాన్ని చూడొచ్చు.
చూడటానికి అది మాంసంలా వుంది. అదే విధంగా రెండు గ్లాసుల గోల్డెన్ లిక్కర్ కూడా ఆ ఫోటోలో మనం చూడొచ్చు. మాన్ కి ముందు ఒక బాటిల్ కూడా ఉంది. ఆ ఫోటో లో మనం కేజ్రీవాల్ తింటున్నట్లు మాన్ ఒక గ్లాసు ని పట్టుకున్నట్లు ఉంది. మా మఫ్లర్ గ్యాంగ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ట్లు ఈ ఫోటోలో ఉంది. అయితే మరి ఇందులో నిజమెంత అనేది ఇప్పుడు చూద్దాం.
2021 నవంబర్ 22 న ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ఫోటో ని పోస్ట్ చేసింది. అది ఒరిజినల్ ఇమేజ్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఒరిజినల్ రిపోర్ట్ ప్రకారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లుధియానాలో ఒక ఆటో డ్రైవర్ ఇంట్లో డిన్నర్ కి వెళ్లారు. అయితే అందులో మందు, మాంసం తీసుకున్నట్లుగా లేదు ట్విట్టర్లో కూడా ఒరిజినల్ ఫోటో ఉంది.
#Punjab: #AamAadmiParty (AAP) national convener and #Delhi chief minister #ArvindKejriwal having dinner at the house of an auto-rickshaw driver in #Ludhiana. pic.twitter.com/ekE3SAQMvG
— TOIChandigarh (@TOIChandigarh) November 22, 2021
అందులో కూడా మందు మాంసం లేదు. దీని ప్రకారం తెలుస్తోంది ఏమిటంటే ఆ ఫోటోలో మందు మరియు మాంసాన్ని డిజిటల్ గా క్రియేట్ చేశారు. అంతే కానీ నిజానికి అరవింద్ కేజ్రీవాల్ మరియు మాన్ మందు, మాంసాన్ని తీసుకోలేదు ఇది కేవలం నకిలీ వార్త మాత్రమే. ఇది నిజం కాదు.