ఫ్యాక్ట్ చెక్: పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్.. నిజమెంత..?

-

సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు బాగా ఎక్కువై పోతున్నాయి. కానీ చాలా మంది నిజమో అబద్దమో తెలియక షేర్ చేసేస్తూ వుంటారు. అయితే ఇటువంటి ఫేక్ వార్తలను ఎవరు నమ్మొద్దు మరియు వాటిని ఫార్వర్డ్ చెయ్యొద్దు. మరొక సారి సోషల్ మీడియాలో ఒక ఫేక్ వార్త వచ్చింది. తాజాగా సిటీ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫేక్ పోస్ట్ పై స్పందించారు.

ఇక అసలు ఏమైంది అనేది మనం చూస్తే… చలాన్ల పెండింగ్ క్లియరెన్స్ పై సోషల్ మీడియా లో ఫేక్ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతోంది. దసరాకు 50 శాతం డిస్కౌంట్ ఆఫర్ తో ఈ నెల 4 నుండి 7వ తేదీ వరకు గోషామహల్ స్టేడియం లో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఈ సోషల్ మీడియా పోస్ట్ లో ఉంది.

అయితే తెలంగాణ ట్రాఫిక్ మెగా లోక్ అదాలత్ స్కీం పేరు తో పెండింగ్ చలాన్లని క్లియర్ చేసుకోవాలని చెబుతున్నారు. అయితే పెండింగ్ చలాన్ల పై డిస్కౌంట్ అనేది ఏమి లేదని డిస్కౌంట్ ఉన్నట్లు ఫేక్ వార్త సర్క్యులేట్ అవుతోంది అని పోలీసులు చెప్పడం జరిగింది. అయితే గత నెల 4న కూడా ఫేక్ న్యూస్ వైరల్ చేశారని పోలీసులు అంటున్నారు. ఇటువంటి వాటిని కనుక మీరు చూశారంటే అసలు నమ్మద్దు మరియు ఫార్వర్డ్ చేయకండి.

Read more RELATED
Recommended to you

Latest news