ఫ్యాక్ట్ చెక్: హెల్త్ కేర్ మీద ఐదు శాతం ట్యాక్స్..? నిజం ఏమిటి..?

-

ఈ మధ్య కాలంలో నకిలీ వార్తలు బాగా ఎక్కువ అవుతున్నాయి. చాలా మంది నకిలీ వార్తల వలన మోసపోతున్నారు. ఏదేమైనప్పటికీ ఆన్లైన్ లో జరిగే మోసాలకి దూరంగా ఉండండి లేకపోతే చాలా సమస్యలు కలగొచ్చు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది మరి అది నిజమా కాదా అనేది ఇప్పుడే చూసేద్దాం.

సోషల్ మీడియాలో తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది ఇక ఆ విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం ఐదు శాతం ట్యాక్స్ ని హెల్త్ కేర్ పైన తీసుకు వచ్చిందని ఒక వార్త నెట్టింట తెగ షికార్లు కొడుతోంది మరి అది నిజమా కాదా అనే విషయానికి వస్తే… ఈ వార్త వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది. ఒక లెటర్ ట్వీట్ తో పాటు అటాచ్ అయి ఉంది.

అది 2011 లోనిది. దీని ప్రకారం చూస్తే ఇది నిజమైన వార్త కాదని నకిలీ వార్త అని క్లియర్ గా తెలుస్తోంది కాబట్టి అనవసరంగా ఇటువంటి నకిలీ వార్తలని నమ్మి మోసపోవద్దు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీని పైన స్పందించింది. ఇది వట్టి నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది. కనుక అనవసరంగా ఇలాంటివి నమ్మి మోసపోవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news