ఫ్యాక్ట్ చెక్: ఇండియా పోస్ట్ లక్కీ డ్రా ని నిర్వహిస్తోందా..? నిజం ఏమిటి..?

-

తరచూ మనకి సోషల్ మీడియా లో ఏదో ఒక ఫేక్ వార్త కనపడుతూనే ఉంటుంది. నిజానికి ఇలాంటివి నమ్మొద్దు అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. ఫేక్ వార్తలు వల్ల మనమే నష్ట పోవాల్సి ఉంటుంది. స్కీములు మొదలు ఉద్యోగాల వరకూ చాలా ఫేక్ వార్తలను మనం చూస్తూనే ఉంటాం. అందుకని తెలియని వాటికీ, అనుమానంగా అనిపించే వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ఒక వార్త వచ్చింది. ఇండియా పోస్ట్ ఆఫీస్ లక్కీ డ్రా ని కండక్ట్ చేస్తున్నట్లు అందులో ఉంది. దీంతో ఆరు వేల రూపాయల ని గెలుచుకోవచ్చు అని రాసి ఉంది. ఈ వార్త చూసిన ప్రతి ఒక్కరు కూడా ఫార్వర్డ్ చేయడం జరుగుతోంది. అయితే నిజంగా పోస్ట్ ఆఫీస్ లక్కీ డ్రా ని కండక్ట్ చేస్తోందా..?

దీని ద్వారా 6,000 రూపాయలని గెలుచుకోవచ్చా..? నిజం ఎంత అనే దాన్ని చూస్తే… ఇండియా పోస్ట్ ఆఫీస్ ఎలాంటి లక్కీ డ్రా ని నిర్వహించడం లేదని తెలుస్తోంది. ఇది కేవలం ఫేక్ వార్త మాత్రమే. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ఈ వార్త పై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా స్పందించింది ఇందులో ఏ మాత్రం నిజం లేదని తేల్చేసింది. అనవసరంగా ఇలాంటి నకిలీ వార్తలు చూసి మోసపోవద్దు. వీలైనంత వరకు ఇలాంటి వార్తలకు దూరంగా ఉండడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news