నకిలీ వార్తల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నకిలీ వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా కనబడుతూ ఉంటాయి. స్కీములు మొదలు ఉద్యోగలు వరకు ఎన్నో నకిలీ వార్తలు సోషల్ మీడియాలో తెగ షికార్లు కొడుతూ ఉంటాయి. నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.
తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. మరి ఇంతకీ నిజమా కాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. ఎటువంటి సాఫ్ట్ డ్రింక్స్ ని తీసుకోవద్దని.. మజా, కోకో కోలా, సెవెన్ అప్, స్ప్రైట్ ఇలా ఏ సాఫ్ట్ డ్రింక్స్ ని కూడా ఎవరు తీసుకోకూడదని అందులో రక్తం కలిసి పోయిందని దీని కారణంగా ఎబోలా వైరస్ స్ప్రెడ్ అవుతుందని.. ఈ మెసేజ్ ని వీలైనంత వరకు అందరికీ తెలియపరచమని సోషల్ మీడియాలో వచ్చిన మెసేజ్ లో ఉంది.
మరి ఇంతకీ నిజమా కాదా అనే విషయాన్ని చూస్తే.. ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది. ఇటువంటిదేమీ జరగలేదు కాబట్టి అనవసరంగా ఇతరులతో ఈ వార్తను షేర్ చేయకండి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీని పై స్పందించింది. ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది సాఫ్ట్ డ్రింక్స్ వల్ల ఎబోలా వైరస్ వ్యాప్తి చెందడం అనేది వట్టి నకిలీ వార్త మాత్రమే.