హైదరాబాద్ నుంచి అండమాన్‌ టూర్.. ఈ ప్రదేశాలు చూసి రావచ్చు..!

-

ఒక మంచి టూర్ వేసి వచ్చేలాయాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. వారం రోజుల పాటు ఎక్కడికైనా వెళ్లి రావాలని అనుకుంటే ఈ టూర్ ప్యాకేజీ ని చూసేయండి. ఇప్పుడు మీకు అదిరిపోయే టూర్ ప్యాకేజీ ఒకటి అందుబాటులో ఉంది. ఇక పూర్తి వివరాలు చూసేద్దాం. ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఐఆర్‌సీటీసీ టూరిజం ఒక ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. హైదరాబాద్ నుంచి అండమాన్ కి వెళ్లి వచ్చేయచ్చు.

అమేజింగ్ అండమాన్ హైదరాబాద్ పేరు తో ఈ ప్యాకేజీ అందుబాటు లో వుంది. 2023 ఆగస్ట్ 18న ఈ టూర్ మొదలు కానుంది. విమానంలో అండమాన్ వెళ్లొచ్చు. టూర్ 5 నైట్స్/ 6 రోజులు. ఇక ఏయే ప్రదేశాలని చూసి రావచ్చనేది చూస్తే.. ఈ టూర్‌లో భాగంగా నెయిలీ ఐలాండ్, పోర్ట్ బ్లెయిర్, రోస్ అండ్ నార్త్ బే ఐలాండ్, హవ్‌లాక్ ఐలాండ్ వంటివి చూసి వచ్చేయచ్చు.

టూర్ ధర రూ. 58,440గా ఉంది. సింగిల్ ఆక్యూపెన్సీకి ఈ రేటు. డబుల్ ఆక్యుపెన్సీ కి ఒక్కొక్కరికి రూ. 45,830 చెల్లించాలి. ట్రిపుల్ ఆక్యూపెన్సీ ఒక్కొక్కరికి రూ. 45,540. చైల్డ్ విత్ బెడ్ రూ. 41,255 చెల్లించాలి. చైల్డ్ విత్ ఔట్ బెడ్ రూ. 37,860. పూర్తి వివరాలని మీరు అధికారిక వెబ్ సైట్ లో చూసి ఈ ప్యాకేజీ ని బుక్ చేసుకోవచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news