ఫ్యాక్ట్ చెక్: ఈ వెబ్ సైట్ తో ఉద్యోగాలు.. నమ్మచ్చా..?

-

సోషల్ మీడియాలో అనేక రకాల నకిలీ వార్తలు మనకు కనపడుతూ ఉంటాయి. ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది నకిలీ వార్తలను నిజం అని నమ్మి మోసపోతున్నారు. ఈరోజుల్లో ఎక్కువగా స్కీముల పేరు తో ఉద్యోగాల పేరు తో నకిలీ వార్తలు మనకి కనబడుతున్నాయి. నిరుద్యోగులు వాటిని నమ్మి అనవసరంగా డబ్బులు కట్టి మోసపోతున్నారు. అలానే స్కీముల పేరు తో పర్సనల్ డీటెయిల్స్ ని తీసుకుంటున్నారు ఏది ఏమైనా నకిలీ వార్తలని గుర్తించడం చాలా అవసరం లేకపోతే అనవసరంగా ఇబ్బంది పడాలి.

తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది మరి అది నిజమా కాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం… ‘https://samagrashiksha.org’ అనే ఒక అధికారిక వెబ్సైట్ తో ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని ఉద్యోగాలు ఇస్తామని ఆ వెబ్సైట్ అంటోంది. పైగా ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్ అని అందులో రాసి ఉంది ఇక మరి ఇది నిజమా కాదా ఇందులో నిజం ఎంత అనేది చూస్తే… ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వానికి ఈ వెబ్సైట్ కి ఎటువంటి సంబంధం లేదు ఈ వెబ్సైట్ నకిలీ వార్తలని స్ప్రెడ్ చేస్తోంది. ఇలాంటి వాటిని నమ్మితే అనవసరంగా మోసపోవాల్సి ఉంటుంది చాలామంది డబ్బులు కట్టడం, పర్సనల్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడం వంటివి చేస్తున్నారు ఇలా వివరాలు ఇస్తే ఖాతా ఖాళి అవుతుంది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది ఇది వట్టి నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది. కనుక అనవసరంగా ఇటువంటి వార్తలు నమ్మి మోసపోకండి ఇతరులకి కూడా షేర్ చేయకండి.

Read more RELATED
Recommended to you

Latest news