ఫ్యాక్ట్ చెక్: పీఎం ముద్ర యోజన స్కీమ్ ద్వారా రూ.10,00,000 లోన్..?

-

మనకి సోషల్ మీడియా లో ఎక్కువగా నకిలీ వార్తలు కనబడుతుంటాయి. ఒక్కొక్క సారి ఏదైనా వార్త వస్తే ఇది నిజమా కాదా అని ఆలోచిస్తూ ఉంటాము. నకిలీ వార్తల్ని కూడా నమ్మి మోస పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.

అందుకే ఎప్పుడైనా సరే నకిలీ వార్తలకు దూరంగా ఉండాలి లేదంటే అనవసరంగా నష్ట పోవాల్సి వస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది. ఇక మరి దాని కోసం చూసేద్దాం. సోషల్ మీడియా లో పీఎం ముద్ర యోజన స్కీమ్ కి సంబంధించి ఒక వార్త వచ్చింది. పీఎం ముద్ర యోజన స్కీమ్ ద్వారా రూ.10,00,000 లోన్ పొందచ్చని..

రూ.4,500 కట్టి వెరిఫికేషన్ ప్రాసెసింగ్ ఫీజు పూర్తి చేసుకోమని అందులో వుంది. మరి నిజంగా పీఎం ముద్ర యోజన స్కీమ్ తో రూ.10,00,000 లోన్ వస్తుందా..? రూ.4,500 కట్టి వెరిఫికేషన్ ప్రాసెసింగ్ ఫీజు పూర్తి చేసుకోమని అనడం లో నిజం ఏంటి అనేది చూద్దాం. ఇది నిజమైన వార్త కాదు. ఇది వట్టి ఫేక్ వార్త మాత్రమే. కనుక అనవసరంగా ఇలాంటి ఫేక్ న్యూస్ లని నమ్మకండి. డబ్బులని కట్టి మోస పోకండి.

Read more RELATED
Recommended to you

Latest news