టిఫా స్కానింగ్ మిషన్లను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

-

తెలంగాణలోని గర్భిణీ స్త్రీలకు శుభవార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ ఆసుపత్రులలో గర్భిణీల సౌకర్యార్థం కొత్తగా ఏర్పాటు చేసిన టిఫా స్కానింగ్ మిషన్లను ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 44 ప్రభుత్వ ఆసుపత్రులలో ఏర్పాటుచేసిన 56 టిపా స్కానింగ్ యంత్రాలను పెట్ల బురుజు ఆసుపత్రి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. టిపా స్కానింగ్ మెషిన్లు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. వందమందిలో ఏడు శాతం శిశువులలో లోపాలు ఉంటాయని, వాటిని టిపా స్కాన్ తోనే గుర్తించడం సాధ్యమన్నారు. ఇక పేట్ల బురుజు ఆసుపత్రిలోనే కెసిఆర్ కిట్ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని.. రాష్ట్రంలో 99.2% ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు జరిగాయి అన్నారు. ఈ టిఫా స్కాన్ ను 18 నుంచి 22 వారాల మధ్యలో చేస్తారని వైద్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news