ఫ్యాక్ట్ చెక్: మథర్స్ డే గిఫ్ట్స్ అంటూ వాట్సాప్ లో వస్తున్న అమెజాన్ లింక్… ఇందులో నిజం ఎంత..?

-

తరచూ మనకి సోషల్ మీడియా లో ఏదో ఒక ఫేక్ వార్త కనపడుతూనే ఉంటుంది. నిజానికి ఇలాంటివి నమ్మొద్దు అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. ఫేక్ వార్తలు వల్ల మనమే నష్ట పోవాల్సి ఉంటుంది. స్కీములు మొదలు ఉద్యోగాల వరకూ చాలా ఫేక్ వార్తలను మనం చూస్తూనే ఉంటాం. అందుకని తెలియని వాటికీ, అనుమానంగా అనిపించే వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

తాజాగా వాట్సాప్ అమెజాన్ కి సంబంధించిన ఒక లింక్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మదర్స్ డే సందర్భంగా బహుమతులు గెలుచుకోవచ్చు అని.. ఆ లింక్ ని క్లిక్ చేసి సర్వేని పూర్తి చేస్తే ఇంటికి గిఫ్ట్ వస్తుంది అని ఆ లింక్ ని అందరు క్లిక్ చేస్తున్నారు అంతా.. తరచూ సోషల్ మీడియాలో ఇలాంటి లింకులు మనకు కనబడుతూనే ఉంటాయి.

ఇలాంటి లింక్ మీద క్లిక్ చేస్తే మనమే నష్ట పోవాల్సి ఉంటుంది. పైగా చిన్న సర్వే ని పూర్తి చేసిన తర్వాత ఇతరులకి ఆ లింక్ ని షేర్ చేయాలని వస్తుంది. ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలని ఇలా కొంత ప్రాసెస్ జరుగుతుంది. అయితే ఈ లింక్ ద్వారా ఎలాంటి గిఫ్ట్ లు రావడం లేదు.

ఇది కేవలం ఫేక్ వద్ద మాత్రమే. వాట్సాప్ లో షికార్లు కొడుతున్న ఈ లింక్స్ ని నమ్మకండి పైగా ఈ లింక్ మీద క్లిక్ చేయగానే కింద కామెంట్ లో మాకు కూడా గిఫ్ట్ వచ్చిందంటూ ఉన్నాయి. కానీ ఇదేం నిజం కాదు ఇది కేవలం నకిలీ వద్ద మాత్రమే కనుక అనవసరంగా వీటి జోలికి వెళ్ళకండి.

Read more RELATED
Recommended to you

Latest news