సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు.
వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం. ఇప్పుడు ఓ ఈమెయిల్ వైరల్ గా మారింది.
ఈ ఈమెయిల్ ”నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్” పేరు మీద పంపించడం జరిగిందట. వీడియో కాన్ఫరెన్సింగ్ సబ్జెక్ట్ తో దీన్ని పంపారు. అయితే ఈ మెయిల్ ని మనం నమ్మచ్చా..? ఈ మెయిల్స్ ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఏ పంపించిందా అనేది చూస్తే.. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ పేరు మీద వచ్చిన వీడియో ఏమి నిజం కాదు. ఇది వట్టి ఫేక్ వార్త మాత్రమే. దీనిలో ఏ మాత్రం నిజం లేదు. ఇటువంటి నకిలీ వార్తలను అనవసరంగా నమ్మి మోసపోకండి.
An email is being sent in the name of the National Informatics Centre with the subject 'videoconferencing'.#PIBFactCheck
▪️ This email is not sent by @NICMeity or by any person associated with it.
▪️ People are advised not to engage with any such emails.@MeitY_NICSI pic.twitter.com/QZeLcw5CP9
— PIB Fact Check (@PIBFactCheck) November 5, 2022