కారుదే మునుగోడు..చరిత్రలో నిలిచే విజయం..!

-

యావత్ తెలంగాణ ప్రజలే కాదు..పక్కనే ఉన్న ఆంధ్ర ప్రజలు సైతం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న మునుగోడు ఉపఎన్నికలో గెలుపు ఎవరిదో తేలిపోయింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో పైచేయి సాధించిన బీజేపీని నిలువరించి అధికార టీఆర్ఎస్ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది. మొదట రౌండ్లలో టీఆర్ఎస్‌కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. అయితే 2,3 రౌండ్లలో తప్ప మిగిలిన రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. దీంతో చివరికి టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి..బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 11వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు.

గెలవడానికి తక్కువ మెజారిటీతో గెలిచిన…ఇది చరిత్రలో నిలిచిపోయే విజయం కానుంది. ఎందుకంటే ఈ ఉపఎన్నిక ఏ స్థాయిలో జరిగిందో అందరికీ తెలిసిందే. వరుసగా దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలిచి ఊపు మీదున్న బీజేపీ..ఊహించని స్థాయిలో బీజేపీలో బలం పెంచుకోవడమే లక్ష్యంగా అడుగులేసింది..కేంద్రంలో అధికారంలో ఉండటం, రాష్ట్రంలో బలమైన నాయకత్వం పెరగడంతో…ఇంకా దూకుడుగా కేసీఆర్ సర్కార్‌ని టార్గెట్ చేస్తూ ముందుకెళ్లింది.

ఇదే క్రమంలో బలమైన నేతలని చేర్చుకుంటూ ఇంకా బలపడే దిశగా పయనిస్తుంది..ఈ క్రమంలోనే నల్గొండ జిల్లాలో గట్టి పట్టున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీలోకి లాగింది. మామూలుగా పార్టీలోకి తీసుకుంటే సరిపోయేది..కానీ పార్టీలోకి వచ్చేవారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయిస్తే బెటర్ అనే పంథాలో ఆయన చేయ రాజీనామా చేయించారు. దీంతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే ఉపఎన్నిక ప్రక్రియ ఎక్కువ రోజులే నడిచింది. దీంతో ఎవరికి వారు ఇతర పార్టీ నేతలని లాగడం ఓటర్లని ఆకర్షించే కార్యక్రమాలు చేశారు.

ఇదే క్రమంలో అధికార టీఆర్ఎస్..తమ అధికార బలాన్ని పూర్తిగా వాడింది..కేసీఆర్ సైతం ఎమ్మెల్యేలు, మంత్రులని మునుగోడుకు మోహరించారు. ఒక్కొక్కరికి ఒక్కో గ్రామం బాధ్యత అప్పగించారు. ఆఖరికి కేసీఆర్ సైతం ఓ గ్రామం బాధ్యతలు తీసుకున్నారు. అయితే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించే విషయంలో మొదట ఇబ్బందులు వచ్చాయి. కొందరు పార్టీ నేతలు వ్యతిరేకించారు. బూర నర్సయ్య గౌడ్ లాంటి నేత బీజేపీలోకి వెళ్లారు..అయినా సరే కూసుకుంట్ల అభ్యర్ధిత్వాన్ని సమర్ధించారు.

ఎక్కడా కూడా తగ్గకుండా ఆర్ధికంగా, సామాజికంగా..అన్నీ రకాలుగా ఓటర్లని ఆకర్షించారు. ప్రతి వర్గాన్ని ఆకర్షించేలా ప్రచారం చేశారు. ఇక టీఆర్ఎస్ పార్టీకి కమ్యూనిస్టులు మంచి సపోర్ట్ ఇచ్చారు. సి‌పి‌ఐ, సి‌పి‌ఎంలతో పొత్తు పెట్టుకోవడం టి‌ఆర్‌ఎస్ పార్టీకి బాగా కలిసొచ్చింది. వారికి మునుగోడులో ఉన్న దాదాపు 20 వేల ఓట్లు టీఆర్ఎస్‌కు ప్లస్. అసలు ఈ మెజారిటీతో గెలిచి బయటపడటానికి కమ్యూనిస్టుల సపోర్ట్ కూడా ఒక కారణం. మొత్తానికి తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేలా మునుగోడు ఉపఎన్నిక జరిగింది..అలాగే చరిత్రలో నిలిచిపోయేలా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన ఈ మునుగోడులో గెలవడం కారు పార్టీకి కొత్త ఊపు వస్తుంది. మునుగోడులో గెలుపుతో గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news