టాలీవుడ్ స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమాగా పుష్ప మీద భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న పుష్ప సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ఈ సినిమాలో విలన్ పాత్ర లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే… ఇవాళ ఫహద్ ఫాసిల్ లుక్ ను రివీల్ చేసింది పుష్ప చిత్ర బృందం. ఇక ఈ లుక్ లో ఫహద్ ఫాసిల్ పోలీస్ గెటప్ లో కనిపిస్తున్నాడు. గుండు గెటప్ లో భయంకరమైన ఫేస్ కట్ తో ఫహద్ ఫాసిల్ ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఈ లుక్ చూస్తుంటే… బన్నీ మరియు ఫహద్ ఫాసిల్ మధ్య ఈ సినిమాలో మంచి సీన్స్ ఉంటాయని అర్థమౌవుతోంది. కాగా ఈ మూవీ పార్ట్ -1 ను ఈ ఏడాది చివర్లో అంటే డిసెంబర్ 25 వ తారుఖున అన్నీ థియేటర్ల లో విడుదల కానుంది.
Meet the #VillainOfPushpa 🔥
The most talented #FahadhFaasil turns into menacing BHANWAR SINGH SHEKHAWAT (IPS) to lock horns with our #PushpaRaj 👊#PushpaTheRise #ThaggedheLe 🤙@alluarjun @iamRashmika @Dhananjayaka @aryasukku @ThisIsDSP @resulp @adityamusic @PushpaMovie pic.twitter.com/tskyU5cZ8a
— Mythri Movie Makers (@MythriOfficial) August 28, 2021