దర్శక నిర్మాతలనూ వదలని కేటు గాళ్లు… వారి నుండి రిక్వెస్ట్ వస్తే జాగ్రత్త !

-

ఈ మధ్యకాలంలో కేటుగాళ్ళు రూటు మార్చారు. ఫేస్ బుక్ లో కొత్త దందా మొదలుపెట్టారు. అదేమంటే ఇద వరికే ఉన్న అకౌంట్ కి సరిగ్గా ఒరిజినల్ అకౌంట్ కి ఉన్న ఫోటో అలాగే ప్రొఫైల్ ఫోటో డౌన్లోడ్ చేసి పెడతారు. ఆ దొంగ అకౌంట్ తో ఒరిజినల్ అకౌంట్ లో ఉన్న ఫ్రెండ్ లిస్టు అందరికీ రిక్వెస్ట్ లు పెడతారు..రిక్వెస్ట్ లు పెట్టి అనంతరం మెల్లగా మాటల్లోకి దింపి ఇప్పుడు చాలా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నామని దయచేసి 10,000 లేదా 20,000 గూగుల్ పే చేయాలని ఒక నెంబర్ ఇస్తారు. ఇప్పుడు అంత డబ్బు లేదు అని చెబితే ఎంత ఉంటే అంత వెయ్యి రేపు కలిసినప్పుడు ఇస్తామని నమ్మబలుకుతారు.

ఇప్పటి దాకా ఈ తరహా దందాతో అందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ దందాకి ఒక దర్శకుడు ఒక నిర్మాత ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ఎస్ వి కృష్ణారెడ్డితో కలిసి సినిమాలు నిర్మించిన అచ్చిరెడ్డి అలాగే ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలు దర్శకత్వం వహించి ప్రస్తుతం నటుడిగా మారిన దేవీ ప్రసాద్ ల పేర్లు మీద ఫేక్ పేస్ బుక్ ఎకౌంటు ఓపెన్ చేసి వారిలాగానే చాట్ చేస్తూ డబ్బులు దండుకునే ప్రయత్నం చేశారు కేటుగాళ్ళు. దీనిని గమనించిన ఈ ఇద్దరూ ఇలా ఎవరు డబ్బులు అడిగిన వారికి వేయొద్దు అని క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news