చిరంజీవిని ఫ్యామిలీ ప్రేక్షకులు అక్కడే చూస్తున్నారు..!!

చిరంజీవి ఈ పేరు తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తన సొంత టాలెంట్, కష్టంతో తెలుగు సినిమా పరిశ్రమ లో నంబర్ వన్ గా ఎదిగిన ధీరుడు. మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లి సినిమాకు దూరం అయ్యారు. మళ్లీ తప్పు తెలుసుకొని వరసగా సినిమాల్లో నటిస్తూ ఉన్నాడు.

దసరా పండుగకు వచ్చిన తన సినిమా గాడ్ ఫాదర్ చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కు చేరలేదని , ట్రేడ్ వర్గాలు తేల్చేశాయి. ప్రస్తుతం చిరంజీవి బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమా లో హీరో రవితేజ కూడా ఒక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగకు రిలీజ్ అవ్వబోతుంది.

ఇక తన గాడ్ ఫాదర్ సినిమా ను నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు. థియేటర్స్ లో కలెక్షన్స్ కురిపించని. ఓటీటీలో మాత్రం గాడ్ ఫాదర్ సంచలనాలు సృష్టిస్తుంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ `గాడ్ ఫాదర్` తెలుగు వెర్షన్ టాప్ 3లో, హిందీ వెర్షన్ టాప్ 1 లో ట్రెండ్ అవుతూ ఉందట. థియేటర్స్ కు రాని ఫ్యామిలీ ప్రేక్షకులు చిరును ఓటీటీలో లో చూసి ఆనందపడుతున్నారట.ప్రస్తుతం వున్నక్రేజ్ కి తగ్గట్టుగా నెట్ ఫ్లిక్స్ లో వున్న సినిమాల్లో ఓ వారం పాటు `గాడ్ ఫాదర్` తెలుగు, హిందీ వెర్షన్ లు టాప్ 10లో వుండే అవకాశం ఉందని తెలుస్తోంది.