ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భారత హాకీ టీమ్.. ఆట, పాటలతో అదరగొట్టిన కుటుంబ సభ్యులు

-

మణిపూర్: ఒలింపిక్స్‌లో భారత హాకీ టీమ్ చరిత్ర సృష్టించింది. 5-4 తేడాతో జర్మనీపై భారత్ ఘన విజయం సాధించింది. 41 ఏళ్ల తర్వాత భారత్ పతకం సాధించడంతో దేశంలో సంబరాలు మిన్నంటాయి. ఒలింపిక్స్‌లో సత్తా చాటిన భారత హాకీ క్రీడాకారుల కుటుంబాల్లో ఆనందం ఆకాశాన్ని అంటుతోంది.  వాళ్ల స్వగ్రామాల్లో సంబరాలు చేసుకుంటున్నారు. స్థానికులతో కలిసి పాట, పాటలతో అదరగొడుతున్నారు.

కాగా భారత హాకీ టీమ్‌లో మణిపూర్ ప్లేయర్ నీలకంఠ శర్మ ఉన్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. ఇంపాల్ డ్యాన్స్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్‌లో హాకీ జట్టు ఘన విజయం సాధించడంలో తమ కుటుంబ సభ్యుడు ఉండటం ఎంతో సంతోషకరమన్నారు. తమకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు.

కాగా ఒలింపిక్స్‌లో జర్మనీపై 5-4 తేడాతో భారత మెన్స్ హాకీ టీమ్ అద్భుత విజయం సాధించారు. దీంతో కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. మ్యాచ్ ప్రారంభమైన రెండు నిమిషాల్లోనే తైమూర్ ఓరుజ్ గోల్ చేశారు. దీంతో జర్మనీ ముందంజలో నిలిచింది. జర్మనీ మొదటి క్వార్టర్‌లో భారతను ఇరకాటంతో పెట్టింది. కానీ ఆధిక్యాన్నిప్రదర్శించలేకపోయింది. 2 వ క్వార్టర్‌లో సిమ్రంజీత్ సింగ్ చక్కటి ప్రదర్శన కనబర్చారు. కానీ టోమాహాక్ షాక్ ఇచ్చారు. రెండు నిమిషాల్లోనే జర్మనీ మరో రెండు గోల్స్ సాధించింది. దీంతో భారత్ ఇబ్బందుల్లో పడినట్లు అనిపించింది.

కానీ హార్దిక్ సింగ్ మొదటి నుంచి రీబౌండ్‌లో స్కోర్ చేయడంతో భారతకు రెండు పెనాల్టీ కార్నర్ ఫలితాలు వచ్చాయి. హర్మన్ ప్రీత్ సింగ్ నెట్‌ల వెనుకవైపు అద్భుతమైన డ్రాగ్‌ఫ్లిక్‌తో మరో గోల్ సాధించారు. మూడో క్వార్టర్‌లో రూపిందర్ పాల్ సింగ్, సిమ్రంజీత్ సింగ్ మరో రెండు గోల్స్ చేశారు. దీంతో జర్మనీపై భారత్ విజయం సాధించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news