తప్పిపోయిన ఉద్యోగి కుటుంబాలకు పెన్షన్..!

-

డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్, పెన్షనర్ల వెల్ఫేర్ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సీసీఎస్ నిబంధనలు 1972 కిందనున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కనుక తప్పిపోతే వారికి సంబంధించిన వేతనం, ఫ్యామిలీ పెన్షన్, రిటైర్‌మెంట్ గ్రాట్యుటీ, సెలవు నగదు పేమెంట్స్ ని ఉద్యోగి కుటుంబానికి చెల్లిస్తారు.

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్, పెన్షనర్ల వెల్ఫేర్ జూన్ 25, 2013న ఈ రూల్స్ కి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ కిందకు వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఈ లాభాలను వర్తింపజేయాలని డిపార్ట్‌మెంట్ నిర్ణయించింది. ఇక ఇది ఇలా ఉంటే ఏప్రిల్ 28, 2022న డీఓపీపీడబ్ల్యూ జారీ చేసిన నోటిఫికేషన్‌ లో డిపార్ట్‌మెంట్‌ 2013 జూన్ 25న జారీ చేసిన ప్రయోజనాలను సర్వీసు సమయం లో తప్పి పోయిన ఎన్‌పీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు కూడా ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు.

జనవరి 1, 2004 నుంచి కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు ఎంపికైన ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా ఎన్‌పీఎస్‌ను అందివ్వాలని… సాయుధ దళాలు మినహాయించి అందరికీ ఇవ్వాలని ఆర్థిక వ్యవహారాల డిపార్ట్‌మెంట్ 2003లో జారీ చేసిన నోటిఫికేషన్‌లో చెప్పారు. అప్పటి నుండి కూడా ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తిస్తుంది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్సియల్ సర్వీసెస్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండించర్‌లతో సంప్రదింపులు జరిపి తప్పిపోయిన సమయంలో వారి కుటుంబాలు పడే ఇబ్బందులను చూసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సీసీఎస్(పెన్షన్) రూల్స్ ప్రకారం లేదా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ రూల్స్ నిబంధన 2015 కింద ప్రయోజనాల కోసం ఉద్యోగిని ఎంపిక చేశారా అనేది ఏమి లింక్ లేకుండా ఇది వర్తిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news