కోతులకు ఫ్యామిలీ ప్లానింగ్‌ : కేసీఆర్ సర్కారు సంచలన నిర్ణయం

-

కోతుల బెడద నివారణ పై మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ… కోతుల నియంత్రణకు గతంలోనే కమిటీ ఏర్పాటు చేశామని.. ఇప్పటికే పలు అంశాలపై ఆ కమిటీ అధ్యయనం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 5 నుండి 6 లక్షల కోతులు ఉన్నాయమని.. కోతులకు కుటుంబ నియంత్రణ చికిత్స అవసరమని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో కోతుల కుటుంబ నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని… ఒక్కొక్క జిల్లాలో ప్రభుత్వ , ప్రైవేటు భాగస్వామ్యంతో కుటుంబ నియంత్రణ చికిత్సల నిర్వహణకు అవకాశాల పరిశీలన ఉంటుందని ప్రకటన చేశారు.

పంటలకు కోతుల బెడద తీవ్రంగా ఉందని.. రైతులను ఈ ఇబ్బంది నుండి గట్టెక్కించాలన్నారు. చేతికొచ్చిన పంటలు కోతుల పాలవుతుంటే రైతులు మనోవేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. కోతుల నియంత్రణకు చట్టపరిధిలో ఉండే ఇతర అవకాశాలను పరిశీలించాలని.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కోతుల నియంత్రణకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ఆయన వివరించారు. పంటల వైవిద్యీకరణకు కోతుల బెడద నివారించాల్సిన అవసరం ఉందని.. అడవులు, జాతీయ రహదారులపై పండ్ల మొక్కలను ప్రతి సీజన్ కు అందుబాటులో ఉండేలా పెంచాలని చెప్పారు. పల్లె ప్రకృతి వనాలలో పండ్ల మొక్కలు తప్పనిసరిగా పెంచాలని.. ఇప్పటికే ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాలలో వేసిన పండ్ల మొక్కలు అప్పుడే ఫలితాలనిస్తున్నాయని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news