ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గరిమెళ్ల ప్రత్యూష శనివారం ఆత్మహత్య చేసుకున్నారు. బంజారాహిల్స్ లోని తన నివాసంలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్యాషన్ డిజైనర్ గరిమెళ్ల ప్రత్యూష హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ లో నివాసం ఉంటున్నారు. శనివారం తన నివాసంలో ఒంటరిగా ఉన్న ఆమె కార్బన్ మోనాక్సైడ్‌ను పీల్చి ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కార్బన్ మోనాక్సైడ్ బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని.. విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.