క్యాన్సర్ బారిన పడ్డ ప్రముఖ హీరోయిన్..!!

-

సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు వరుసగా క్యాన్సర్ బారిన పడుతుండడంతో ప్రతి ఒక్కరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే సోనాలి బింద్రే, గౌతమి, హంసనందిని లాంటి మరెంతో మంది హీరోయిన్లు క్యాన్సర్ బారినపడి దేవుడి దయతో అభిమానుల ఆశీస్సులతో మహమ్మారి నుంచి బయటపడిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సంఘటన మరువకముందే మరో బాలీవుడ్ హీరోయిన్ మహిమా చౌదరి కూడా క్యాన్సర్ బారిన పడినట్లుగా తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఇదే విషయాన్ని నిజం చేస్తూ తెలిపాడు బీటౌన్ నటుడు అనుపమ్ ఖేర్. మహిమా చౌదరి తాజాగా బ్రెస్ట్ కాన్సర్ తో బాధపడుతోంది అంటూ తన సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు.

అనుపమ్ ఖేర్ తను చేయబోయే ది సిగ్నేచర్ సినిమాలో మహిమ నటించాలని కోరుకున్నాను.. ఈ విషయాన్ని తనకు చెప్పే ప్రయత్నం చేశాను.. కానీ అందుకు మహిమ ఒప్పుకోలేదు. దీనికి కారణం క్యాన్సర్ తో పోరాడుతున్నాను అని తెలిపింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు గా తనకు తెలిసింది అని అనుపమ్ ఖేర్ తెలిపాడు. ఇక మహిమ కూడా మాట్లాడుతూ నాకు నటించడానికి ఎన్నో సినిమా అవకాశాలు, వెబ్ సిరీస్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. కానీ నాకు శిరోజాలు లేని కారణంగా వాటన్నింటిని తిరస్కరించాను అని ఆమె తెలిపింది. ఇక అనుపమ్ ఖేర్ నుంచి ఒక సినిమా ఆఫర్ వచ్చింది అని .. ఈ విషయంలో అనుపమ్ ముందు నిజాన్ని.. క్యాన్సర్ విషయాన్ని దాచి లేక పోయాను అని హీరోయిన్ మహిమ స్పష్టం చేసింది.

ప్రస్తుతం బ్రెస్ట్ క్యాన్సర్ నయం కావడానికి ప్రస్తుతం ఒక ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాను అని.. దీనిని ఎదుర్కోవడానికి అనేక మార్గాలు కూడా ఉన్నట్లు వైద్యులు చెపుతున్నారు అని హీరోయిన్ మహిమా చౌదరి వివరించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ నటులు ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mahimachaudhry (@mahimachaudhry1)

Read more RELATED
Recommended to you

Latest news