‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్’ అంటూ నయనతారకు శుభాకాంక్షలు తెలిపిన రోజా..

-

దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార తన ప్రియుడు, తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. జూన్ 9న మహాబలిపురంలోని ఓ విలాసవంతమైన రిసార్టులో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రజనీకాంత్, విజయ్, షారుక్ ఖాన్ వంటి సూపర్ స్టార్లు వీరి వివాహ వేడుకకు తరలివచ్చారు. అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం ఆడంబరంగా జరిగింది.

వీరి పెళ్లి ఫోటోలను విగ్నేష్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. అయితే ఈ కొత్త జంటకు ఏపీ మంత్రి రోజా శుభాకాంక్షలు తెలిపారు. నయనతార, విగ్నేష్ వైవాహిక జీవితం నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానని రోజా అన్నారు. ఇద్దరికీ “హ్యాపీ మ్యారీడ్ లైఫ్” అంటూ శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడి ఆశీస్సులు మీకు ఉండాలని ప్రార్థిస్తున్నాను అని ట్వీట్ చేశారు ఆర్.కె.రోజా.

 

Read more RELATED
Recommended to you

Latest news