జూమ్ లోకి వస్తేనే పారిపోయావ్… డైరెక్ట్ గా వస్తే తట్టుకోగలవా అని నారా లోకేష్ పై సెటైర్ వేశారు విజయసాయిరెడ్డి. నిన్న జూమ్ మీటింగ్ ఘటనపై ట్విట్టర్ లో లోకేష్ పై సెటైర్లు పేల్చారు రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి.
జూమ్ లోకి వస్తేనే మ్యూట్ చేసి పారిపోయావ్… నేరుగా రమ్మని సవాల్ విసిరావే అని మండిపడ్డారు. డైరెక్ట్ గా వస్తే తట్టుకోగలవా లోకేశం? చిన్న పిల్లలతో రాజకీయం చెయ్యడం కాదు.. పోయి పప్పు తిని పడుకో చిట్టయ్యా అంటూ ఓ రేంజ్ లో ఆడేసుకున్నాడు విజయసాయి.
టెన్త్ ఫలితాల మీద కూడా పేలాలు ఏరుకోవడం ఏమిటి పప్పూ అని చురకలు అంటించారు. జులై 6-15 మధ్య మళ్లీ పరీక్షలు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించినా పిల్లల తో జూమ్ మీటింగ్ పెట్టడం, ‘ఏం కావట్లేదే’ అనే శాడిస్టు బుద్ధి కనిపిస్తోందన్నారు. జూమ్ కాస్తా రసాభసై మధ్యలోనే పారిపోయావుగా అంటూ ఎద్దేవా చేశారు విజయసాయి.