రాష్ట్రంలో ఇప్పుడుప్పుడే తెలుగుదేశం పార్టీ పికప్ అవుతుందని చెప్పొచ్చు…పూర్తి స్థాయిలో కాకపోయిన…కొంతవరకు పార్టీ పుంజుకుంది. పలు జిల్లాల్లో వైసీపీకి పోటీగా టీడీపీ వచ్చింది. అయితే అన్నీ జిల్లాలది ఒక దారి…చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లాది ఒక దారి అన్నట్లు ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ పెద్దగా పుంజుకున్నట్లు కనిపించడం లేదు. పేరుకు చిత్తూరు చంద్రబాబు సొంత జిల్లా గాని…ఇక్కడ ఆధిక్యం మాత్రం వైసీపీదే. గత రెండు ఎన్నికల్లో చిత్తూరులో వైసీపీ సత్తా చాటిన విషయం తెలిసిందే…గత ఎన్నికల్లో చిత్తూరులో వైసీపీ అదిరిపోయే విజయాన్ని అందుకుంది.
14 సీట్లకు గాను…13 సీట్లు గెలుచుకుంది..అలాగే రెండు ఎంపీ సీట్లు కూడా వైసీపీ వశం అయ్యాయి. ఇక ఒక కుప్పంలోనే చంద్రబాబు గెలిచారు. అంటే చిత్తూరులో ఎలాంటి పరిస్తితి ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది…ఈ మూడేళ్లలో పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరిగింది…అటు చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలపై కూడా వ్యతిరేకత పెరిగింది…దాదాపు సగం మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. కానీ ఆ వ్యతిరేకతని ఉపయోగించుకుని బలపడటంలో టీడీపీ నేతలు ఫెయిల్ అయ్యారు.
ఉదాహరణకు పూతలపట్టు, గంగాధర నెల్లూరు, మదనపల్లె, సత్యవేడు లాంటి నియోజకవర్గాల్లో వైసీపీకి పెద్ద పాజిటివ్ లేదు. అలాగే నగరిలో రోజాకు అంతగా పాజిటివ్ లేదు. అలా అని ఈ నియోజకవర్గాల్లో టీడీపీకి పాజిటివ్ కనిపించడం లేదు. అంటే వైసీపీపై వ్యతిరేకత వచ్చిన సరే దాన్ని పూర్తిగా ఉపయోగించుకుని బలపడలేని స్థితిలో టీడీపీ నేతలు ఉన్నారు.
అందుకే చిత్తూరులో టీడీపీ పికప్ కాలేకపోతుంది. పలమనేరు, పీలేరు స్థానాల్లోనే టీడీపీకి పాజిటివ్ కనిపిస్తోంది. కుప్పంలో ప్రస్తుతానికి టీడీపీకి ఇబ్బంది ఉన్నా…ఎన్నికల నాటికి బాబు అది కవర్ చేసేస్తారు. అంటే కేవలం మూడు స్థానాల్లో టీడీపీ పొజిషన్ బెటర్ గా ఉంది. మొత్తానికి చూసుకుంటే బాబు సొంత జిల్లాలో వైసీపీకే ఆధిక్యం ఉన్నట్లు కనిపిస్తోంది.