ఓర్ని న్యూడిల్స్‌ ఇలా చేస్తారా..? వీడియో చూస్తే మళ్లీ తింటారా..?

-

స్ట్రీట్‌ ఫుడ్స్‌ భలే రుచిగా ఉంటాయి కదూ.. వాళ్లు చేసినట్లే ఇంట్లో చేసినా అంత రుచిరాదు..ఇలా మన అమ్మతో అంటే.. వాళ్లలా నేను మురికిగా చేయలేదు కదా.. నీకు ఆ రోడ్డుపక్కన ఉండే జంక్‌ ఫుడ్డే నచ్చుతుంది అంటూ చివాట్లు పెడుతుంది.. పానీపూరీ గురించి ఇప్పటికే కథలుకథలుగా చెప్పుకున్నాం.. ఎన్నో ఘోరమైన వీడియోలు చూశాం. కానీ ఎవ్వరూ మానలేదు. తింటూనే ఉన్నారు. మీకు పానీపూరీతో పాటు.. న్యూడిల్స్‌ అంటే కూడా ఇష్టం ఉండాలే.. వాటి రూచి కూడా సూపర్‌ ఉంటుంది.. ఎగ్‌ న్యూడిల్స్‌, చికెన్‌ న్యూడిల్స్‌, వెజ్‌ న్యూడిల్స్‌ ఇలా బోలెడు రకాలు..మీకు అసలు న్యూడిల్స్‌ ఎలా తయారు చేస్తారో ఎప్పుడైనా డౌట్‌ వచ్చిందా..? న్యూడిల్స్‌ తయారీకి సంబంధించి ఓ వీడియో నెట్టింట చెక్కర్లు కొడుతుంది. అది చూస్తే..మీ ఒపినీయన్‌ మార్చుకుంటారో లేదో..?

ఓ నూడుల్స్​ తయారీ చేసే ఫ్యాక్టరీలో ఈ వీడియో తీశారు. దీనిని చిరాగ్​ బర్జాత్యా అనే ట్విట్టర్​ యూజర్​ పోస్ట్​ చేశాడు. “చివరిగా మీరు షెజ్వాన్​ సాస్​తో కలిపిన రోడ్​ సైడ్​ చైనీస్​ హక్కా నూడుల్స్​ను ఎప్పుడు తిన్నారు?” అని కాప్షన్​ ఇచ్చాడు. ఈ వీడియోలో.. కొందరు నూడుల్స్​ను తయారు చేస్తూ కనిపించారు. పిండి పదార్థాలను మెషిన్​లో వేయడం, వాటిని కంటైనర్​లోకి పెట్టడం, తర్వాత బాయిల్​ చేయడం, ఆరబెట్టడం ఈ పనులన్నీ చూపిస్తారు.. వంటి పనులు చేశారు. నూడల్స్​ తయారీ చేసే ప్రక్రియ బాగానే ఉన్నప్పటికీ.. వారు తయారు చేసిన విధానమే ఆందోళనకరంగా ఉంది.. ఎక్కడా పరిశుభ్రతను పాటించలేదు. చేతులకు గ్లౌజ్​లు వేసుకోలేదు. కంటైనర్​లు, మెషిన్​లు చాలా దారుణంగా ఉన్నాయి. మట్టితో కూడిన ఫ్లోర్​ మీద ఆ నూడుల్స్​ను పడేస్తున్నారు.

సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోను చూసి చాలా మంది షాక్​ అవుతున్నారు. ‘ఇంత పరిశుభ్రంగా నూడుల్స్​ను తయారు చేస్తున్నారేంటీ?’ అని కొందరు సెటైర్లు వేస్తున్నారు.. ఢిల్లీలోని అన్ని కిచెన్​​లలోనూ ఇదే విధంగా 100శాతం పరిశుభ్రత ఉంటుంది. మీరు తినే పానీపూరీ, కుల్చా, భేల్​పూరీలను పెద్ద మొత్తంలో ఎలా తయారు చేస్తారో చూస్తే.. ఇక మీరు వాటిని తినడమే మానేస్తారు,” అని ఓ నెటిజన్​ కామెంట్​ చేశాడు. కొందరు మాత్రం.. ఈ వీడియోలోని ఫ్యాక్టరీని వెనకేసుకొస్తున్నారు. “నూడుల్స్​ను బాయిల్​ చేస్తే బ్యాక్టిరియా పోతుంది. హై టెంపరేచర్​ ఆయిల్​లో కుక్​ చేస్తే బ్యాక్టీరియా పోతుంది. టెన్షన్​ పడాల్సిన అవసరమే లేదు.. అంటున్నారు.. మొత్తానికి ఆ వీడియో మరీ కాస్త ఆందోళనకరంగానే ఉంది.. చూడండి మరీ..!

Read more RELATED
Recommended to you

Latest news