యువరాణిలా మెరిసిపోతున్న ఫరియా అబ్దుల్లా.. ఫోటోలు వైరల్..!!

-

ఫరియా అబ్దుల్లా.. జాతి రత్నాలు సినిమాతో చిట్టిగా క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్ కుటుంబానికి చెందినవారు. కానీ ఈమె తల్లిదండ్రులు ప్రస్తుతం దుబాయ్ లోనే సెటిల్ అవ్వడం జరిగింది. కానీ ఈమెకు సినిమాల మీద ఆసక్తితో సినీ ఇండస్ట్రీ వైపు రావడం గమనార్హం. ఫరియ అలా జాతి రత్నాలు సినిమాలో అవకాశాన్ని దక్కించుకొని ఒకే ఒక సినిమాతో గ్లామర్ బ్యూటీ గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ఈమె అందాలకు అబ్బాయిలు ఫిదా అయితే..ఈమె హైట్ చూసి ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు సైతం స్టన్ అయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా ట్రెడిషనల్ లుక్ లో పక్కా తెలుగు అమ్మాయిల మెరిసిపోతోంది ఫరీయా..

ఇకపోతే ప్రభాస్ ని మించిన హైట్ తో స్టార్ హీరోలను సైతం ఆశ్చర్యపరచిన ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వస్తున్నాయి.. కానీ తన హైట్ కు తగ్గట్టు ఉండే హీరోల సినిమాలలో అవకాశాలు రావడం లేదు. అందుకే సినిమాల ఎంపిక విషయంలో హీరో హైట్ ను బట్టి కూడా ఈమె పాత్రలు ఎంచుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అలా ఇటీవల బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్లో అలరించిన ఫరియా అబ్దుల్లా ఇప్పుడు మరొక సినిమాలో నటించబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ అమ్మడికి వరుస అవకాశాలు వస్తూ ఉండడం గమనార్హం.

మరొకవైపు సోషల్ మీడియాలో తన డాన్స్ స్కిల్స్ ప్రదర్శించడమే కాకుండా మరొక పక్క అందాల ఆరబోతతో యువతను బాగా ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె గోల్డెన్ కలర్ ఎంబ్రాయిడరీ లెహంగా ధరించి చూపరులను బాగా ఆకట్టుకుంటుంది. ఇంత అందం మన తెలుగమ్మాయి సొంతం అంటూ నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.

మొత్తానికైతే ఫరియా షేర్ చేసిన ఈ ఫోటోషూట్ యువతను బాగా ఆకట్టుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news