LIVE : ప్రధాని మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం..!

-

ప్రధాని మోదీ తాజగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన ఎర్రకోటపై నుంచి దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. దేశ రక్షణలో భాగంగా ప్రాణాలు త్యాగం చేసిన జవాన్లను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కరోనావేళ ముందుండి ప్రజలకు సేవలు చేసిన కరోనావారియర్లను అభినందించారు. కరోనాపై తప్పకుండా విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. తొలుత ఈ ఉదయం రాజ్‌ఘాట్ వద్దకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.

త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

  • కరోనా తెచ్చిన ముప్పు ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ప్రణామం వైద్యులు, నర్సులు, అంబులెన్స్ డ్రైవర్లు అందరూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు నిరంతరం కృషిచేస్తున్నారు
  • కరోనా ఒకటే కాదు.. దేశవ్యాప్తంగా వరదలు, ప్రకృతి విపత్తులు మనల్ని చుట్టుముట్టాయి.. భారతీయ రక్షణ దళాలు, పోలీసు దళాలు నిరంతరం మనల్ని రక్షిస్తున్నాయి. అలాంటి సైనికులు, పోలీసులకు వందనం
  • కేంద్రం, రాష్ట్రాలు ఏకతాటిపై ఉండి విపత్తులను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాయి.. సవాళ్లు మన సంకల్పాన్ని మరింత సుదృఢం చేస్తాయి 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో అనేకం సాధించాం.. ఇంకా మనం అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాం.. 75 ఏళ్లు పూర్తయ్యే సరికి మరో అడుగు ముందుకేస్తాం
  • ఎఫ్‌డీఐల విషయంలో భారత్‌ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎఫ్‌డీఐల్లో గతేడాది 18 శాతం వృద్ధి సాధించాం. ఎఫ్‌డీఐల్లో వృద్ధి ప్రపంచం మనపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనం.
  • యువతకు కొత్త అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఆహార ఉత్పత్తి నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లోనూ కొత్త అవకాశాలు సృష్టించే ప్రయత్నాలు. వ్యవసాయ రంగం నుంచి బ్యాంకింగ్‌ వరకు అన్ని రంగాల్లో సంస్కరణలు ప్రారంభించాం.
  • మన ప్రజాస్వామ్య విలువలు, నిబద్ధత భారత్‌ పట్ల నమ్మకాన్ని మరింత పెంచుతున్నాయి.. అనేక సంకటాలు ఎదుర్కొన్న దేశం ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్తోంది
  • కరోనా సమయంలో ఆత్మనిర్భర్ భారత్ నినాదం అందుకొని ముందుకు సాగడం అనివార్యం అన్న ప్రధాని మోదీ అన్నారు. ఆత్మనిర్భర్ అనేది కేవలం మాటలు కాదు, అది ఒక మంత్రంగా భావించాలని ఆయన అన్నారు.

  • దేశంలోని ప్రజలందు ‘వోకల్ ఫర్ లోకల్’ ఉండాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు. స్వదేశీ వస్తువుల తయారీని ప్రమోట్ చేసేందుకు అంతా కలిసి పనిచేయాలన్నారు. భారత్‌లో తయారయ్యే వస్తువుల్ని విదేశాలకు భారీగా ఎగుమతి చెయ్యాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news