ఫామ్ హౌస్ లో ఉన్న వారికి కూడా రైతు భరోసా ఇవ్వాలా..? : మంత్రి సీతక్క

-

ఫామ్ హౌస్ లో ఉన్న వారికి కూడా రైతు భరోసా ఇవ్వాలా..? అని ప్రశ్నించారు మంత్రి సీతక్క. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఏడో రోజు కొనసాగుతున్నాయి. రైతు భరోసా విధి విధానాలపై శాసన సభ ప్రారంభం అయింది. ఈ సందర్భంగా ప్రతిపక్షం నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. రైతు బంధును బీఆర్ఎస్ ప్రభుత్వం అందరికీ ఇచ్చిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కొందరికే ఇవ్వాలని పేర్కొంటుందన్నారు.

ఇచ్చిన హామీల మనరకు రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కోతలకు సిద్ధమయ్యాకే మంత్రి వర్గ ఉపసంఘం వేశారని కేటీఆర్ మాట్లాడారు. ఈ తరుణంలోనే మంత్రి సీతక్క మాట్లాడారు. రాష్ట్రంలో రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ ది అని గుర్తు చేశారు. కౌలు రైతులకు రైతు బంధు ఎందుకు అని మీరు అనలేదా..? అని ప్రశ్నించారు. సాగులేని భూములకు కూడా రైతు బంధు ఇచ్చారు. మీరు ఇచ్చింది రైతు బంధు కాదు.. పట్టా పెట్టుబడి. పట్టా ఉన్న వారికే రైతు బంధు ఇచ్చారు. భూమి లేని పేద రైతులకు పదేళ్లలో మీరు ఏమి ఇచ్చారని ప్రశ్నించారు సీతక్క.

Read more RELATED
Recommended to you

Latest news