రైతుల ఉసురు తగిలి పోతారు : కేసీఆర్ పై ఈటల ఫైర్

కెసిఆర్ సర్కార్ పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు ఉసురు తగిలి పోతారని కెసిఆర్ పై ఫైర్ అయ్యారు. ఈటల రాజేందర్ మొఖం అసెంబ్లీ లో కనిపించవద్దు అని హుకుం జారీ చేసి.. పూర్తి అధికార, పోలీసు యంత్రాంగాన్ని సీఎం కెసిఆర్ దుర్వినియోగం చేశారని ఫైర్ అయ్యారు. కుటుంబాలను చెరబట్టి.. రూ. 600 కోట్ల నల్లధనం ఖర్చు చేశారని అగ్రహించారు.

ఒక్కో నాయకుడికి 2 లక్షల నుండి 2 కోట్ల రూపాయలు ఇచ్చారని.. ఎన్ని చేసినా హుజూరాబాద్ ప్రజలు తెలంగాణ ఆత్మ గౌరవం గెలిపించారని వెల్లడించారు. ఎమర్జెన్సీ తరువాత అంతగా ఎదురుచూసిన ఫలితం హుజూరాబాద్ ఎన్నిక అని.. రాజకీయ పార్టీలు, నాయకుల్లారా ఏమైనా చేసి అధికారం పొందుదామని ఆలోచన చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు పాలన చేస్తున్నారు… కానీ కెసిఆర్ పాలనను ప్రజలు పారద్రోలడం ఖాయమని హెచ్చరించారు సిఎం కెసిఆర్. ఈ వేదిక మీద నుండి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని… ఏ పార్టీ ఏం చేస్తుంది గమనించండన్నారు.