ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలియాలా..? అయితే ఇలా చూడండి..!

-

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి టోల్ ప్లాజా దగ్గర కూడా టోల్ ని వసూల్ చేస్తోంది. ఫాస్ట్‌ట్యాగ్‌ ని కనుక మీరు పొందాలి అంటే కనీస రీఛార్జ్ మొత్తం రూ. 100గా ఉంది. వాహనం రకం, ఫాస్ట్‌ట్యాగ్ సేవకు లింక్ చేయబడిన ఖాతా ని బట్టీ అమౌంట్ అనేది ఉంటుంది. టోల్ ప్లాజా ని దాటాలంటే ఫాస్ట్‌ట్యాగ్ లో బ్యాలెన్స్ ఉండాలి.

ఫాస్ట్‌ట్యాగ్ లో బ్యాలెన్స్ లేదు అంటే టోల్ ప్లాజా ని దాటడానికి కుదరదు. ఒక్కో సారి మనం చూసుకోము ఫాస్ట్ ట్యాగ్‌లో బ్యాలెన్స్ అయిపోతుంది. అలాంటప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. రద్దీగా ఉండే హైవేపై ప్రయాణిస్తుంటే మీ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవడానికి ఈ సింపుల్ టిప్స్‌ ని ఫాలో అవ్వండి. ఇక వాటి కోసం మనం చూసేద్దాం. సులభమైన మార్గాల్లో మీరు మీ మీ ఫాస్ట్‌ట్యాగ్ ఐడీని సృష్టించి.. బ్యాంక్ వెబ్‌సైట్ లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌ని తెలుసుకోవచ్చు.

ఎన్‌హెచ్ఏఐ యాప్ కూడా ఇందుకు సహాయ పడుతుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో లేదా యాప్ స్టోర్‌లోకి వెళ్లి మై ఫాస్ట్ ట్యాగ్ యాప్‌లో ఫాస్ట్ ట్యాగ్ ఖాతాకు సంబంధించిన వివరాలను చెక్ చేసుకోండి. అలానే మిస్డ్ కాల్ అలర్ట్ ఫెసిలిటీ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 88843 33331కి మిస్డ్ కాల్ ఇవ్వాలి. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా లేదా పేటీఎం, జీపే లేదా ఫోన్‌పే వంటి డిజిటల్ చెల్లింపు యాప్‌ల ద్వారా కానీ మీరు మీ ఫాస్ట్ ట్యాగ్ ఖాతాను రీఛార్జ్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news