నవీన్‌ కేసులో మరో ట్విస్ట్‌.. షాకింగ్‌ నిజాలు బయటపెట్టిన నిహారిక !

-

 

నవీన్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు బయటపెట్టింది నిందితుడు హరిహార కృష్ణ ప్రియురాలు నిహారిక. నవీన్ కేసులో దొరికే ఛాన్స్ లేదని హరి చెప్పాడు. దీంతో హరిని నమ్మాను అని పోలీసులతో నిహారిక వివరించింది. తాను, నవీన్ ఇంటర్ నుంచి ప్రేమించుకున్నామని, తమ ఇంట్లోనే ఇద్దరం కలుసుకునే వాళ్ళమని చెప్పింది. నవీన్ తాను గొడవ పెడితే హరిహర కృష్ణ సర్దిచెప్పేవాడని, ఇద్దరి మధ్య తనే మధ్యవర్తిగా ఉండేవాడిని వెల్లడించింది.

తాను నవీన్ విడిపోయాక హరి తనను ప్రేమిస్తున్నానని చెప్పానని వెల్లడించింది. అంతేకాక తరచుగా నవీన్ నీ చంపేసి, తనను కిడ్నాప్ చేసి తీసుకెళ్తానని అనేవాడని, తాను మందలిస్తే ఊరికే సరదాగా అన్నానని చెప్పేవాడని యువతి పోలీసులకు తెలిపింది. అంతేకాక హరి, నవీన్ ను హత్య చేయడానికి వాడిన కత్తులు, రెండు గ్లాసులు తనకు చూపించాలని యువత వెల్లడించింది.

నవీన్ హత్య తర్వాత తను నాలుగు సార్లు హరిని కలిశానని తెలిపింది. హత్య విషయం గురించి తనకు తెలిసినా కావాలని పోలీసులకు, ఫ్రెండ్స్ కు చెప్పలేదని వెల్లడించింది. ఈ కేసులో తాము దొరికే అవకాశం లేదని హరి తనతో చెప్పాడని, అతని మాటలు నమ్మానని యువతి వెల్లడించింది. నవీన్ హత్య తర్వాత తాము వనస్థలిపురం ప్రాంతంలో మూడుసార్లు కలిసామని ఒప్పుకుంది. హత్య తర్వాత హరికి 1500 రూపాయలు ఇచ్చి పారిపోయేందుకు సహకరించానని యువతి అంగీకరించింది.

Read more RELATED
Recommended to you

Latest news