బయటకు రావాలంటే ఫీజు.. లాక్ డౌన్ కి సర్కార్ ప్రత్యామ్నాయం ?

-

పెరుగుతున్న కోవిడ్ -19 కేసులను తగ్గించే ప్రయత్నంలో భాగంగా నాసిక్ అధికారులు ఒక గంట మార్కెట్లోకి ప్రవేశించడానికి గాను ప్రజల వద్ద నుండి ఐదు రూపాయలు వసూలు చేస్తోంది. “నాసిక్‌లో COVID-19 వ్యాప్తిని తగ్గించడానికి తాము వేరే విధానాన్ని ఉపయోగిస్తున్నామని ఒక గంటకు మార్కెట్ ప్రాంతంలోకి ప్రవేశించడానికి ప్రతి వ్యక్తికి ₹ 5 టికెట్ ఇస్తున్నామని ఒకరకంగా లాక్‌డౌన్‌ విదించకుండా ఉండడనికి ఇలా చేస్తున్నమాని నాసిక్ సిటీ పోలీసు కమిషనర్ దీపక్ పాండే పేర్కొన్నారు.

Bharat Bandh
Bharat Bandh

ఇక ఇది విజయవంతం అయితే మిగతా సిటీలు, ప్రాంతాల్లో కూడా ఫాలో అవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక నిన్న  మహారాష్ట్రలో కొత్తగా 27,918 కోవిడ్ -19 కేసులు నమోదు కాగా 139 మంది మరణించారు. ఇదిలావుండగా, వైరస్ కోసం తమను తాము పరీక్షించుకోవాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే ప్రజలను కోరారు. ప్రజలు చాలా ఆలస్యంగా పరీక్షలు చేయించుకుంటున్న నేపధ్యంలో పరిస్థితి చేయి దాటి పోతుందని, ఐసియు మరియు ఆక్సిజన్ పడకలు వేగంగా నిండిపోతున్నాయని అందుకే అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ ముందే పరీక్షలు చేయించుకోమని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news