సోంఫు ఒక మసాలా. ఈ గింజలను రకరకాల వంటలలో ఉపయోగిస్తారు. రుచి, వాసనను పెంచుతుంది కాబట్టి నోటిని శుభ్రపర్చుకోవడానికి ఉపయోగిస్తారు. సోపు గింజల్లో పొటాషియం, మాంగనీస్, జింక్, ఇనుము ఇంకా రాగి వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల మీ ఆరోగ్యానికి ఇది మేలు కలుగుతుంది. సోంఫు గింజల ద్వారా లభించే ఆరోగ్యం మీ వశం కావాలంటే సోంఫు గింజల నీటిని తయారు చేసుకోవచ్చు.
ఈ సోంఫు గింజల వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో, ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
ఎలా తయారు చేయాలంటే,
సోంపు గింజలను తయారు చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. రాత్రిపూట సోంఫి గింజలను నీళ్ళలో నానబెట్టి ఉదయం పూట తాగితే సరిపోతుంది.
ప్రయోజనాలు
జీర్ణక్రియ
జీర్ణక్రియ సంబంధిత సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే సోంఫి గింజల నీటిని తాగండి. మలబద్దకం, ఉబ్బరం వంటి సమస్యలను ఇది దూరం చేస్తుంది. గ్యాస్ట్రిక్ ఎంజైములను ఉత్పత్తి చేయడంలో ఇది బాగా సాయపడుతుంది.
బీపీ నియంత్రణ
ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీపీని నియంత్రించడంలో సాయపడుతుంది.
కళ్ళ ఆరోగ్యానికి
సోంఫు గింజల్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది కళ్ళకి మేలు చేస్తుంది.
రుతుస్రావ సమయంలో నొప్పిని నివారించడానికి
మహిళల్లో నెలసరిలో కలిగే నొప్పులను నివారించడానికి సోంఫు గింజలు బాగా పనిచేస్తాయి. నెలసరిలో నొప్పి ఇబ్బంది పెడుతున్నప్పుడు సోంఫు గింజల నీటిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
క్యాన్సర్ నివారణలో:
కడుపు, చర్మం, రొమ్ము క్యాన్సర్ల నివారణలో సోంఫి గింజలు బాగా పనిచేస్తాయి.
బరువు తగ్గడానికి
బరువు తగ్గాలని మీరు భావిస్తున్నారా? మీ రోజువారి దినచర్యలో సోంపు గింజలను చేర్చుకుంటే చాలు. కొన్ని రోజుల్లో మంచి ఫలితం కనిపిస్తుంది.