కిషన్ రెడ్డికి కేబినేట్ హోదా.. నావల్లే అంటున్న రేవంత్ రెడ్డి.

కేంద్ర ప్రభుత్వం కేబినేట్ ని విస్తరించిన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నాయకుడు ఎంపీ కిషన్ రెడ్డికి కేబినేట్ హోదా దక్కిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు సహాయమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి, విస్తరణలో భాగంగా కేబినేట్ హోదా దక్కించుకున్నాడు. ఐతే కిషన్ రెడ్డికి కేబినేట్ హోదా దక్కడం నా వల్లే అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఛీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసారు. ఇటీవలే టీపీసీ ఛీఫ్ గా ప్రమాణం స్వీకారం చేసిన మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డికి కేబినేట్ హోదా నా వల్లే వచ్చిందని చెప్తున్నారు.

తెలంగాణలో నన్ను ఎదుర్కోవాలంటే బీజేపీ అగ్రనాయకత్వం బలంగా ఉండాలని కేంద్రం భావించిందని, అందువల్లే కిషన్ రెడ్డికి కేబినేట్ హోదా ఇచ్చారని మీడియాతో మాట్లాడారు. మొత్తానికి రేవంత్ రెడ్డి టీపీసీ ఛీఫ్ గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి తెలంగాణ రాజకీయాల్లో వేడి మొదలైంది. నిన్నటిదాకా టీఆర్ఎస్, బీజేపీ అన్నట్టుగా ఉన్న రాజకీయాలు, రేవంత్ రాకతో కాంగ్రెస్ కూడా బలపడిందని చెప్పుకుంటున్నారు.