సీఎం కేసీఆర్‌ నియోజకవర్గాల టూర్‌లో స్వల్ప మార్పులు

-

బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్… నియోజకవర్గాల పర్యటనల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ నెల 26న నాగర్ కర్నూలుకు బదులు వనపర్తిలో, 27న స్టేషన్ ఘనపూర్‌కు బదులు మహబూబాబాద్, వర్దన్నపేటలలో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. మిగిలినవి యథాతథంగా కొనసాగుతాయి. కేసీఆర్ ఈ నెల 15న మేనిఫెస్టోను ప్రకటించారు. అదే రోజు హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున చుట్టి వస్తున్నారు. హుస్నాబాద్, జనగామ, భువనగిరి, సిద్దిపేట, సిరిసిల్ల, జడ్చర్ల, మేడ్చల్‌లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. అయితే ఆ తర్వాత బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో విరామం ఇచ్చారు. గురువారం నుంచి మళ్లీ పర్యటనలు ప్రారంభిస్తున్నారు. 26న అచ్చంపేట, వనపర్తి, మునుగోడు, 27న పాలేరు, మహబూబాబాద్, వర్దన్నపేట సభల్లో పాల్గొంటారు.

Telangana CM sick for a week: Medical team treating KCR at home, says son  KTR - The South First

ఇదిలా ఉంటే.. సీఎం కేసీఆర్‌ ఈ ఎన్నికల్లో గజ్వేల్‌, కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నారు. నవంబర్‌ 9న ఒకేరోజు ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేస్తారు. ఆనవాయితీ ప్రకారం 9న ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గజ్వేల్‌లో మొదటి నామినేషన్‌, మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో రెండో నామినేషన్‌ దాఖలు చేస్తారు. 4 గంటలకు కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news