బ్యాంకులు నిండకపోయినా.. కంచాలు నిండుతున్నాయి.. సినీ కార్మికులు సమ్మెకు దిగడం సరికాదు: నరేష్

-

టాలీవుడ్ సినీ కార్మికులు సమ్మెకు దిగడం పై సీనియర్ నటుడు నరేష్ స్పందించారు. ఒకట్రెండు యూనిట్లకు చెందిన కార్మికులు సమ్మె చేస్తున్నారని వెల్లడించారు. వేతనాలు పెంచకపోతే షూటింగులు ఆపేస్తామని పోరాటం చేస్తున్నారని తెలిపారు. డిమాండ్ల కోసం పోరాడటం మంచిదేనని, దీనిపై ఇండస్ట్రీలో పెద్దలు చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. అయితే దాదాపు మూడేళ్లుగా కరోనా వల్ల సినీ రంగం కూడా తీవ్ర నష్టపోయినట్టు తెలిపారు.

చిన్న ఆర్టిస్టులు, కార్మికులు పూట గడవక నానా ఇబ్బందులు పడ్డారని.. వైద్య ఖర్చులు కూడా లేకుండా ప్రాణాలు విడిచిన ఘటనలు జరిగాయి అని నరేష్ వివరించారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుట పడుతున్నాయని, వెంటిలేటర్ పై ఉన్న చిత్ర పరిశ్రమ ఊపిరి పీల్చుకుంటుందని, సినిమాలు విడుదల అవుతున్నాయి అని వివరించారు. తెలుగు సినిమాకు మంచి పేరు వస్తోందని.. బ్యాంకులు నిండకపోయినా.. కంచాలు నిండుతున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఆకస్మిక సమ్మెకు దిగడం సరి కాదని నరేష్ అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news