మైలార్ దేవ్ పల్లి ప్లాస్టిక్ ఫ్యాక్టరీ లో భారీ అగ్ని ప్రమాదం

రాజేంద్రనగర్ సర్కిల్ కు చెందిన మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది . ఆరాంఘర్ దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ పక్కన ఇవాళ తెల్లవారు జామున ఈ దుర్ఘటన జరిగింది.స్క్రాప్ కావడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమయానికిన్ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఐదు అగ్నిమాపక శతకాలతో మంటలను అదుపులోకి తెచ్చారు.

మంటలతో పటు పొగ రావడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుదాఘాతం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు వ్యక్తం చేసారు. గత కొన్ని రోజులుగా వివిధ కంపెనీలకు చెందిన వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేస్తుండడంతో తరచూ ఈ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ ప్రాంతానికి చెందిన స్థానికులు ఈ ప్రమాదం కారణంగ ఆందోళనని వ్యక్తపరిచారు.

 

 

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?