బ్రేకింగ్ : తమిళ్ నడిగర్ సంఘం ఆఫీస్ లో అగ్నిప్రమాదం.. కీలక ఫైళ్లు దగ్ధం

-

చెన్నైలోని అభిబుల్లా రోడ్‌లోని యాక్టర్స్ అసోసియేషన్(నడిగర్ సంఘం) కార్యాలయ భవనంలో మంటలు చెలరేగాయి. నడిగర్ సంఘం ఆఫీస్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతుంది ఈ అగ్నిప్రమాదంలో ఆఫీసుకు సంబంధించిన కీలక ఫైళ్లు అయినట్లు చెబుతున్నారు. తేనాంపేట నుండి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను నియంత్రిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఘానికి నటుడు నాజర్ అధ్యక్షుడిగా ఉండగా నటుడు విశాల్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు.

ఈ ప్రమాదంలో సామాగ్రితో పాటు కీలక ఫైళ్లు  కూడా కాలిపోయాయని అంటున్నారు. నడిగర్ సంఘానికి నిధులు ఎంత ఉన్నాయి ? వాటిలో ఎంత ఖర్చు అయ్యాయి అనే విష‌యాల‌తో పాటు ఏ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించి ఎంత మేర‌కు నిధులు సేక‌రించారు అనే వివ‌రాలకు సంబంధించిన ఫైళ్లు అన్నీ ఈ ఆఫీసులో ఉన్నాయని అంటున్నారు. దీంతో ఇది నిజం గానే ప్ర‌మాద‌మా?  లేక ఎవ‌రైనా కావాల‌నే తగులబెట్టించారా ? అనే అనుమానాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి.  పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలపై దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news