నిఖిల్ ” స్పై” మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

-

నిఖిల్ కథానాయకుడిగా రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ‘స్పై’ చిత్రానికి గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతవరకు ఎడిటర్ గా పని చేస్తూ వచ్చిన ఆయనకు దర్శకుడిగా ఇది మొదటి సినిమా. ఒకవైపు నిఖిల్ తాజా చిత్రాలుగా ’18 పేజెస్ ‘, కార్తికేయ-2 ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి. ఆ తరువాత సినిమా అయిన ‘స్పై ‘ ని కూడా ఆయన లైన్ లో పెట్టేస్తున్నాడు. త్రిల్లర్ జోన్ల లో రూపొందుతున్న చిత్రం స్పై. ఈ చిత్రం నుంచి కొద్దిసేపటి క్రితం ఫస్ట్ గ్లింప్స్ ని వదిలారు.

మంచుకొండల్లో హీరో అన్వేషణ.. అక్కడ రహస్యంగా దాచిన ఆయుధాలను వెతికి తీసుకోవడం.. తన లక్ష్యం దిశగా ముందుకు దూసుకుపోవడం ఈ గ్లింప్స్ లో చూపించారు. దీంతో సినిమాపై ఆసక్తిని పెంచెవిదంగానే ఈ గ్లింప్స్ ఉంది. నిఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమాగా దీనిని చెబుతున్నారు. ఈ సినిమాలో నిఖిల్ సరసన నాయికగా ఐశ్వర్య మీనన్ నటిస్తోంది. బాలీవుడ్, హాలీవుడ్ కి చెందిన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పని చేస్తుండడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news