“తుగ్లక్ దర్భార్” సోషల్ మీడియాలో హల్‌చల్..!

-

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని కోలీవుడ్ స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నారు విజయ్ సేతుపతి. తాజాగా ఆయన నటిస్తోన్న ‘తుగ్లక్ దర్భార్’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. చూడటానికి ఎంతో డిఫరెంట్‌గా ఉన్న ఈ పోస్టర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్న ఈ పోస్టర్ ట్విట్టర్‌లో వైరల్ అవ్వడం విశేషం. ఈ సినిమాను లలిత్ కుమార్ నిర్మిస్తుండగా.. ఢిల్లీ ప్రసాద్ దీనదయాల్ దర్శకత్వం వహిస్తున్నాడు. గోవింద్ వసంత్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. రాధా కృష్ణన్ పార్థిబన్, అదితి రావ్ హైదరీ, మంజిమా మోహన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news