దేశంలో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసులు టెన్షన్ పుట్టిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు చోట్ల కొత్త కేసులు నమోదు అయ్యాయి. నిన్నటి దాకా ఇరవై కరోనా కేసులు నమోదు కాగా ఇప్పుడు ఈ ఉదయం ఆ కరోనా కేసులు 25 కు చేరుకున్నాయి. సాధారణ కరోనాతో పోల్చుకుంటే 70 శాతం వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నందున దాన్ని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంది.
దాదాపు అన్ని రాష్ట్రాలు కొత్త సంవత్సరం వేడుకలపై నిషేధం విధించాయి. నిజానికి ఈ మ్యుటెంట్ కరోనా వైరస్ డిసెంబరు కన్నా ముందే ఇండియాలో ఎంటరయిందని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా ప్రకటించారు. సెప్టెంబరులో యూకేలో ఇది కనిపించిందని, కానీ ఈ వైరస్ నవంబరులో మనదేశంలో ప్రవేశించిందని పేర్కొన్నారు. దీంతో మరింత టెన్షన్ నెలకొంది అని చెప్పచ్చు.