ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

-

ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంభం సమీపంలో లారీని ఓ కారు వెనకనుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మాచర్ల నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులను పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు వాసులుగా గుర్తించారు. మృతుల్లో అనిమిరెడ్డి (60), గురవమ్మ (60), అనంతమ్మ (55),ఆదిలక్ష్మి (58), నాగిరెడ్డి (24) ఉన్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. కుటుంబంలోని వారంతా దుర్మరణం చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news