కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిర్ణయాలు మరియు నిబంధనలు అమలు చేసినప్పటికీ ని…. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య మాత్రం తగ్గటం లేదు. నిర్లక్ష్యం మరియు ఓవర్ స్పీడ్ కారణంగా వివిధ ప్రాంతాల్లో అనేక రకమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక తాజాగా… రాజస్థాన్ లోని జైపూర్ సమీపం లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీ కొట్టింది.
ఈ దారుణ సంఘటన లో ఏకంగా ఐదురుగు విద్యార్థుల తో పాటు కారు డ్రైవర్ అక్కడి క్కడే మృతి చెందారు. విద్యార్థులు రీట్ ప్రవేశ పరీక్షకు వెళుతుండగా.. ఈ దారుణ ప్రమాదం చోటు చేసుకుంది. పరీక్షకు వెళుతున్న విద్యార్థులు దుర్మరణం పాలవడం తో వారి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదం లో మునిగి పోయారు. ఇక అటు ఈ రోడ్డు ప్రమాదం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… మృత దేహాలను జైపూర్ లోని ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. అలాగే.. ఈ ఘటన పై దర్యాప్తు కూడా చేపట్టారు పోలీసులు.