‘Raabta’ మూవీకి ఐదేళ్లు.. ఎమోషనల్ అయిన కృతి సనన్.. పాట పాడుతూ..?!

-

హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన సినిమా రాబ్తా(Raabta). ఈ సినిమా రిలీజ్ అయి ఐదేళ్లు పూర్తి చేసుకుంది. జూన్ 9, 2017లో విడుదల అయిన ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ అందుకుంది. ప్రముఖ దర్శకుడు దినేశ్ విజన్ దర్శకత్వంలో హీరోయిన్‌గా కృతిసనన్ నటించారు. ఈ సినిమా ఐదేళ్లు పూర్తి చేసుకోవడంతో కృతి సనన్ సినిమాకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ఈ సినిమాతో తనకు ఎంతో ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉందని పేర్కొన్నారు.

కృతి సనన్
కృతి సనన్

కృతి సనన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో రాబ్తా సినిమా గురించి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. హృదయాన్ని కదిలింపజేసే సినిమా రాబ్తా అని, ఎన్నో జ్ఞాపకాలతో కూడిన మధుర ప్రయాణమని చెప్పుకొచ్చారు. అలాంటి సినిమాలో తాను నటించడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. దర్శకుడు దినేశ్ విజన్, హీరో సుశాంత్ సింగ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకొచ్చారు. అనంతరం సినిమాలోని టైటిల్ సాంగ్ పాటను పాడారు. ఆ పాటకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news