చాలా మంది సంపాదించినా డబ్బులతో కొంత డబ్బు సేవ్ చేసుకోవాలని చూస్తారు. అలా దాచుకుంటే ఆ వడ్డీతో మంచి రాబడి వస్తుంది. మీరు కూడా డబ్బులని భవిష్యత్తు కోసం ఆదా చెయ్యాలని అనుకుంటున్నారా..? అలాంటి వారికి ఫిక్స్‌డ్ డిపాటిజ్ బెస్ట్. నిర్దిష్ఠ కాలానికి చిన్న మొత్తాల నుంచి భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటారు. అయితే ఇలా చేస్తే ఎంత లాభం వస్తుంది అనేది ఇప్పుడు చూసేద్దాం.
ఫిక్స్‌డ్ డిపాజిట్ల లో రకాలు కూడా వున్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. ఎఫ్‌డీల్లో చాలా రకాలు వున్నాయి. అయితే ఇవి ప్రధానంగా రెండు రకాలు. క్రమంగా చేతికి వడ్డీ రావడం ఒక రకం. వడ్డీ మొత్తం ఒకేసారి రావడం ఇంకో రకం.
క్యుములేటివి ఫిక్స్‌డ్ డిపాజిట్, నాన్ క్యుములేటివ్ ఫిక్స్‌డ్ డిపాజిట్:
ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి వడ్డీని మెచ్యూరిటీ సమయం అయ్యాక చెల్లిస్తారు క్యుములేటివి ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆప్షన్ లో. వడ్డీని డిపాజిటర్‌కి అందజేస్తారు. పైగా ప్రిన్సిపల్ అమౌంట్‌తో పాటే.
ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ ని లెక్కిస్తారు. దాన్ని అసలుతో కలుపుతారు. మూడు నెలలకి ఇది పెరుగుతుంది. కానీ మధ్యలో వడ్డీ తీసుకోవడానికి కుదరదు.
ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై క్రమంగా చేతికి ఆదాయం రావాలంటే నాన్ క్యుములేటివ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ని ఎంపిక చేసుకోవాలి.
పెట్టుబడి పెట్టిన డబ్బులు మెచ్యూరిటీ సమయం దాకా అంతే ఉంటుంది.
నెల, మూడు, ఆరు, సంవత్సరానికి ఒకసారి డబ్బులని తీసుకోవచ్చు.
సాధారణ వడ్డీ మాత్రమే ఉంటుంది. కంపౌండ్ ఇంట్రెస్ట్ ఉండదు.