ఎల్‌ఐసీ నుంచి సూపర్ పాలసీ.. పూర్తి వివరాలు మీకోసం..!

-

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బీమా కవర్ ప్రొవైడర్ ఎల్‌ఐసీ తీసుకువచ్చిన స్కీమ్స్ లో బీమా జ్యోతి పాలసీ పాపులర్ పాలసీ. చాలా మంది ఈ పాలసీ ప్రయోజనాలని పొందుతున్నారు. కుటుంబ భద్రతతో పాటుగా పొదుపు ప్రయోజనం కూడా పొందొచ్చు. నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, జీవిత బీమా సేవింగ్స్ ప్లాన్ ఇది. ప్రమాదవశాత్తూ పాలసీదారు మరణిస్తే పాలసీ కింద కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం పొందుతారు.

అలానే పాలసీదారు మెచ్యూరిటీ సమయానికి జీవించి ఉంటే హామీ ఇవ్వబడిన మొత్తం ఆదాయం అందుతుంది. ఒకవేళ కనుక లిక్విడిటీ అవసరమైతే లోన్ బెనిఫిట్ ని పొందొచ్చు. ఇక ఈ పాలసీ కి సంబంధించి పూర్తి వివరాలని చూస్తే.. కనీసం లక్ష రూపాయల హామీ మొత్తం మీకు వస్తుంది. పాలసీలో 15 నుంచి 20 ఏళ్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు అవుతుంది.

ఇందులో ఎంతైనా పెట్టచ్చు పరిమితి లేదు. మెచ్యూరిటీకి 5 సంవత్సరాల ముందు వరకు పాలసీ కింద ప్రీమియం చెల్లించాలి. 90 రోజుల నుండి 60 సంవత్సరాల వయస్సు వాళ్ళు ఈ పాలసీ తీసుకోవచ్చు. మెచ్యూరిటీ వయస్సు 18 సంవత్సరాలు. గరిష్ట వయస్సు 75 సంవత్సరాలు. ఇందులో నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక, వార్షిక ప్రాతిపదికన పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో మీరు నెల నెలా పెట్టుబడి పెట్టాలంటే రూ.5000 పెట్టాలి.

మూడు నెలలకి అయితే రూ. 15,000 అవుతుంది. వార్షిక హామీతో కూడిన రాబడి కూడా ఉంటుంది. ఈ పాలసీ లో ప్రతి సంవత్సరం చివరిలో రూ. 50 చొప్పున ప్రాథమిక హామీ మొత్తంతో పాటుగా హామీ ఇవ్వబడుతుంది. వెయ్యికి రూ. 50 బోనస్ పొందుతారు. ప్రతి రూ.1,000 పాలసీ కి ఏడాదికి రూ.50 జమ చేస్తారు. ఏడాదికి ఐదు శాతం ఖచ్చితమైన రిటర్న్ వస్తుంది. రూ.10 లక్షల పాలసీ ని కనుక మీరు 20 ఏళ్లకు తీసుకుంటే… ఏడాదికి వెయ్యికి రూ.50 లెక్కల రూ.10 లక్షలకు రూ.50వేలని మీరు అదనంగా పొందొచ్చు. ఇరవై ఏళ్ల పాటు ప్రతి సంవత్సరానికి రూ.50వేల చొప్పున మీకు వస్తాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news