సరే బలపరీక్షలో గెలిచారు… అధికారం కాపాడుకుంటారా…? మరో కర్ణాటక చేసుకుంటారా…?

-

గత ఏడాది మేలో… హడావుడిగా కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యురప్ప ప్రమాణ స్వీకారం చేసారు. వెంటనే బలపరీక్ష సమయం… ఎక్కువ రోజుల వ్యవధి కూడా లేదు… అధికారం కోసం బిజెపి ఏ స్థాయిలో ప్రయత్నాలు చేసినా సరే… డీకే శివకుమార్ ని దాటి వెళ్ళలేకపోయింది… ముఖ్యంగా కేసి వేణుగోపాల్, దినేష్ గుండూరావు, సిద్దరామయ్య చేసిన రాజకీయం దెబ్బకు, అప్పుడు దేవెగౌడ విసిరిన సెంటిమెంట్ బాణాలు వెరసి కర్ణాటకలో బిజెపికి అధికారాన్ని దూరం చేసాయి… ఇప్పుడు సీన్ మహారాష్ట్రకు వచ్చింది… బిజెపికి సరైన బలం లేదు… 

శివసేన హ్యాండ్ ఇచ్చింది… అనూహ్య మలుపుల తర్వాత ఎన్సీపీని 30 ఏళ్ళ నుంచి నడిపిస్తున్న అజిత్ పవార్ ని చీల్చింది… ఒక్క మాటలో చెప్పాలి అంటే పవార్ కుటుంబాన్ని చీల్చింది. బుధవారం బలపరీక్ష జరపాలని సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేల గాలి కూడా బయటకు వెళ్ళకుండా శరద్ పవార్ అష్టదిగ్బంధనం చేసారు. కుటుంబాలతో కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే మాట్లాడటానికి వీలు లేకుండా చేసారు. పవార్ ని దాటుకుని రేపు బిజెపి విజయం సాధించడం దాదాపు అసాధ్యం… మరాఠా ప్రజలతో పాటు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది…

అంతా బాగానే ఉంది గాని రేపు బలపరీక్షలో కూటమి విజయం సాధిస్తుంది సరే… మరి 5 ఏళ్ళు అధికారాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుందా…? ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రం చెప్పడం కష్టమే… రాజకీయంగా బిజేపి కేంద్రంలో బలంగా ఉంది… ఆ బలాన్ని ఉపయోగించి ఎమ్మెల్యేలను కొనవచ్చు… వారానికి ఒకరు జారినా ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కష్టమే… కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ… ఈ మూడు పార్టీల అధినేతలకు కూడా ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కత్తి మీద సామే… కర్ణాటకలో ఈ ఏడాది ప్రభుత్వాన్ని కాంగ్రెస్ జెడిఎస్ కూటమి జార్చుకుంది… మరి వాళ్ళలా కాకుండా… అధికారాన్ని ఎంత వరకు కాపాడుకుంటారు అనేది చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news