కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య..కార్తీక్ వాళ్లను తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఆనంద్ రావు, ఆదిత్య వస్తారు. పెద్దొడిగురించి ఏమైనా ఆచూకి తెలిసిందా అంటే..అదే ట్రై చేస్తున్నాం మమ్మీ అంటాడు. సెల్ ఫోన్ టవర్స్ ద్వారా తెలుసుకోవచ్చు అంటారుగా అని సౌందర్య అంటే..అసలు లిఫ్ట్ చేయటం లేదు అంటాడు ఆదిత్య. ఆ మోనిత వల్లే అన్నయ్య చాలా డిప్రషన్ లోకి వెళ్లాడు..అందుకే వెళ్లాడు..అంటాడు ఆదిత్య. తనసంగతి ఇప్పుడు ఎందుకులేరా అంటే..ఇలా ఈజీగా తీసుకుంటేనే ఇంతదాక వచ్చింది..బయట అన్నయ్య గురించి అడుగుతుంటే..ఆ మోనిత గురించే మాట్లాడుతున్నారు అంటాడు ఆదిత్య.
మరోపక్క దీప గుడిలో దేవుడికి తన గోడును చెప్పుకూంటూ సీన్ లాగ్ చేస్తుంది. ఇక్కడ కార్తీక్ ఫోన్ తీసుకున్న వ్యక్తి ఆ ఫోన్ ను అమ్ముదాం అనుకుంటాడు. ఒకటే ఫోన్లు వస్తాయి..కానీ వాడు లిఫ్ట్ చేయడు. ఫోన్ అమ్మేసి జల్సాలు చేద్దాం అనుకుంటాడు. సౌందర్య బస్తీకు వచ్చి జరిగింది చెప్పి ఏడుస్తుంది. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి అంటూ సౌందర్య బాధపడుతుంది. వారణాసి వాళ్లు మాకు తెలియదు అని బాధపడతారు.
ఆరోజు రాత్రి దీప ఇంట్లో పడుకోవటానికి చీరలనే దుప్పట్లుగా వేసి పిల్లలను పడుకోపెడుతుంది. కార్తీక్ ను పిలుస్తుంది. కార్తీక్ పిల్లల చేతులు పట్టుకుని సారీరా..మిమ్మల్ని ఇలాంటి ప్లేస్ కు తీసుకువచ్చి కష్టపెడుతున్నాను అంటాడు. శౌర్య..ఇవన్నీ నాకు బస్తీలో అలవాటే, అప్పుడే నువ్వు లేవు, ఇప్పుడు నువ్వు ఉన్నావు అది చాలు అంటారు. వాళ్లు కాస్త అలా మాట్లాడుకుండగా..బయట ఎవరికో పురిటినొప్పుల బాధ వినిపిస్తుంది. డాక్టర్ బాబు వెళ్దాం అని దీప అంటే..కార్తీక్ వద్దంటాడు. కానీ నొప్పులు మరీ ఎక్కువగా రావడంతో..దీప కార్తీక్ ను బయటకు తీసుకెళ్తుంది.
అక్కడ వాళ్లు డాక్టర్ లేడు, ఉన్న ఒక్క మంత్రసాని లేదు ఇప్పుడు ఏం చేద్దాం అని బాదపడుతూ ఉంటారు. దీప వెళ్లి ఏమైంది అని అడుగుతుంది. వాళ్లు విషయం చెప్తారు. హిమ మా డాడీ డాక్టర్ అని చెప్పబోతుంది. కార్తీక్ ఆపుతాడు. దీప మీరేదైనా ట్రీట్మెంట్ చేయొచ్చుకదా నేను హెల్ప్ చేస్తాను అని దీప అంటే..సారీ దీప నాలో డాక్టర్ ఎప్పుడో చచ్చిపోయాడు అంటాడు కార్తీక్. దీప పిల్లలను లోపలికి పంపిస్తుంది. ఆ అమ్మాయి చచ్చిపోతుంది మీరేం చేయలేరా అంటుంది. కార్తీక్ కు ఆ పేషెంట్ భార్య తిట్టిన తిట్లే వినిపిస్తాయి. నేను చేయలేను అంటాడు కార్తీక్. చాలా గొప్పగా ఆలోచిస్తున్నారు డాక్టర్ బాబు..మీరేం చేయలేరా అంటే.. ఎవరిదగ్గర అయినా ఫోన్ ఉందేమో అడుుగు అంటాడు. దీప ఫోన్ తెచ్చి ఇస్తుంది. కార్తీక్ అంబులెన్స్ కి కాల్ చేస్తాడు. అంబులెన్స్ వచ్చే లోపు అక్కడున్న వాళ్లతో..ఆ చెట్టుకింద సామాన్లు చూసి..ఏంటి అని అడుగుతుంది. మీరుండే ఇళ్లు మాదేనమ్మా., అప్పుచేశాం అని స్వాధీనం చేసుకున్నారు అని జరిగింది చెప్తాడు.
అంబులెన్స్ వస్తుంది. ఆ అమ్మాయిని తీసుకువెళ్తారు. అందరూ వెళ్లిపోతారు. కార్తీక్ తో దీప..మాట్లాడుతుంది. ఏంటండి మీరు..కళ్లముందే అంత జరుగుతుంటే మీరు అలా చూస్తూ ఉండిపోయారేంటి అంటే..నేను డాక్టర్ ని కాదు దీప, నా డాక్టర్ పట్టా రద్దు చేశారు, నేను డాక్టర్ గా అనర్హుడిని దీప అంటాడు. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయిభాగంలో దీపకు ఎక్కడో మధ్యాహ్న భోజనం చేయటానికి పని కుదురుతుంది. కార్తీక్ పిల్లలతో నేను డాక్టర్ ని అని ఎవరికి చెప్పొద్దమ్మా అంటాడు. పాపం దాంతో ఇద్దరూ ఏడ్చేసి మరి మీ నాన్న ఏం చేస్తారంటే ఏం చెప్పాలి డాడీ అంటాడు. ఎరువుల కొట్లో అకౌంటెంట్ అని చెప్పండి అంటాడు. ఈ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. సీరియల్ ని మొత్తం మార్చేశారు..ఎన్నిరోజులు వీళ్లకు ఈ పేదరికం పెడతారో..మోనిత అయితే..కచ్చితంగా వీళ్ల ఆచూకి కనుక్కుంటుంది.